Site icon NTV Telugu

Lady Doctor Incident: హిందూపురంలో లేడీ డాక్టర్ అనుమానాస్పద మృతి

Lady 1

Lady 1

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం వాసవి ధర్మశాల రోడ్డు లోని జి.ఆర్. లాడ్జ్ లో డాక్టర్ అక్షిత(26) అనే మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. అక్షిత చిక్కబలాపుర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మాతాశిశు (గైనకాలజిస్ట్) విభాగంలో డాక్టర్ గా పని  చేస్తుంది. డాక్టర్ అక్షిత జి.ఆర్. లాడ్జి లో విగతజీవిగా పడి వుండడంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాక్టర్ ది హత్య లేదా ఆత్మహత్య అన్న విషయం  పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది .అక్షిత తెలంగాణ రాష్ట్రం వరంగల్ కు చెందిన వ్యక్తిగా లాడ్జి రికార్డ్స్ లో ఉంది. ఆమెతో పాటు లాడ్జిలో ఉన్న మరో యువకుడిని అదుపులోకి తీసుకుని రెండవ పట్టణ పోలీసులు విచారిస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో హిందూపూర్ వచ్చిన అక్షితతో పాటు మరో యువకుడు మహేష్ వర్మ పేరుమీద లాడ్జిలో రూమ్ తీసుకున్నారు.

Read Also: Pak Terrorist Captured: సరిహద్దుల్లో పట్టుబడ్డ ఉగ్రవాది.. సైన్యంపై దాడి చేస్తే రూ.30 వేలు

రికార్డ్స్ లో భార్య భర్తలుగా పేరు రాశారు. సాయంత్రం రూమ్ ఖాళీ చేసేసి చిక్బల్లాపూర్ వెళ్తామని చెప్పారు. అయితే డాక్టర్ అక్షిత మృతిచెందడంతో హత్య ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . అక్షిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. పోలీసుల అదుపులో వున్న మహేష్ వర్మను పోలీసులు విచారిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుకు చెందిన వర్మ హ్తెదరాబాద్ లో ఇంటీరియల్ డిజ్తెనర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే.. మృతురాలి భర్త వరంగల్ లో అర్థో పెడిక్ వైద్యుడిగా పనిచేస్తున్నారు.

Exit mobile version