Mine Collapses : ఛత్తీస్గఢ్లో కుప్పకూలిన గని.. ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mine Collapses : ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. సున్నపురాయి గని కొంత భాగం కూలిపోవడంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రమైన జగదల్పూర్కు 12 కిలోమీటర్ల దూరంలోని నగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్గావ్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని ఇక్కడ పోలీసు అధికారి తెలిపారు. 15 మందికి పైగా కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బస్తర్ జిల్లాలోని మాలేగావ్ పంచాయతీలో గల చుయ్ గనిలో ఇవాళ తవ్వకాలు జరుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ‘బాధితులు గనిలో మట్టిని తవ్వుతుండగా, దానిలో కొంత భాగం పడిపోవడంతో వారు శిథిలాల కింద చిక్కుకున్నారు” అని అతను చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఏడుగురు వ్యక్తులు మాత్రమే మట్టిని తవ్వుతున్నట్లు తెలుస్తోంది. అయితే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Chhattisgarh | Seven people killed while extracting limestone from a mine after it collapsed in the Bastar district pic.twitter.com/20sDD0JEjN
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 2, 2022
తాజావార్తలు
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..