రాహుల్ గాంధీ విషయంలో ఏపిలోని పార్టీల తీరుని తప్పుబట్టారు కేవీపీ రామచంద్రరావు. రాహుల్ ఎపిసోడులో ఏపీలోని ప్రధాన పార్టీల మౌనంపై కేవీపీ ఆగ్రహం చెందారు. చంద్రబాబు తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చాలని కేవీపీ సూచించారు. ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీ స్పందించడం లేదన్నారు కేవీపీ.రాహుల్ విషయంలో బీజేపీ కుట్రలను తప్పు పడుతూ ఏపీ నుంచి ఒక్క ఎంపీ కూడా స్పందించ లేదు.పార్లమెంటులో ప్రజాస్వామ్యం హత్య జరిగితే ఒక్క ఎంపీనైనా స్పందించరా..?అధికార పార్టీకి 30 మంది ఎంపీలు ఉన్నా స్పందించ లేదు.అధికార పార్టీ ప్రత్యేక పరిస్థితుల్లో సైలెంట్ అయ్యారు.ప్రజాస్వామ్యాన్ని అత్యంత మిన్నగా గౌరవించే వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నేత.1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు పెద్ద ఎత్తున పోరాటం చేశారు.మోడీ హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తామని చంద్రబాబు 2002లో ప్రకటించిన ధీశాలి.. ఈయనా మౌనంగానే ఉన్నారు.ఇక ప్రశ్నించడానికే పుట్టిన జనసేనాని.. బీజేపీ నేతలను అంతర్గతంగానైనా ప్రశ్నించాలి.మూ చంద్రబాబు ఓ రకంగా మిత్రపక్షాలమే.
Read Also: IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..
2018 ఎన్నికల్లో తెలంగాణలో మేం కలిసి పని చేశాం.2019లో చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తే రాహుల్, మన్మోహన్ సింగ్ వంయి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వెళ్లి సంఘీభావం తెలిపారు.సరైన కారణానికి సంఘీభావం తెలపకుంటే.. రేపటి రోజు ఆ హక్కులను మీరు కొల్పోతారు.ఇది వైసీపీకి, టీడీపీకి, జనసేనకు వర్తిస్తుంది.ఏపీ నుంచి ఒక్క ప్రజా ప్రతినిధైనా సంఘీభావం ప్రకటించకపోవడం కరెక్ట్ కాదు.బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేసే వాళ్లను ఈ ప్రభుత్వం అణిచివేయకూడదు.చంద్రబాబు తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చాలి.రేపటి రోజు మనకేదెన్నా జరిగితే మనల్ని పట్టించుకునే వాడు ఉండడనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు కేవీపీ.
రాహుల్ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా పూర్తైంది.రాహులును మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది.రాహుల్ పై భౌతిక దాడులు తప్ప మోడీ ప్రభుత్వం అన్ని రకాల వేధింపులకు గురి చేస్తోంది.రాహుల్ లండన్లో భారత దేశాన్ని అవమానించారనే విమర్శలు చేశారు.భారత దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబాన్ని మోడీ అవమానిస్తోంది.అదానీ గురించి రాహుల్ ప్రశ్నించగానే ఇబ్బంది పెట్టడం ఎక్కువైంది.రాహుల్ క్షమాపణలుకకర చెప్పాలంటూ సభను జరగనివ్వలేదు.అధికార పార్టీ సభ్యులే సభను జరగనివ్వకపోవడం ఇదే తొలిసారి.ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు లేకున్నా.. రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తప్పించారు.
ఇక భారత దేశ సార్వభౌధికారానికి అర్థమేంటీ..?అదానీ వ్యవహరంపై జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మోడీని విమర్శిస్తే ఓబీసీలను అవమానించారని ఏదేదో ఆరోపణలు చేస్తున్నారు. మోడీ అంటే బీసీలేనా.. పార్శీలు ఉన్నారు.. ముస్లింలు ఉన్నారు.. జైన్, మార్వాడీలు ఇలా చాలా సామాజిక వర్గాలు వాళ్లున్నారు.కేవలం బీసీలనే రాహుల్ విమర్శించారంటూ నడ్డా లాంటి వాళ్లు కూడా మాట్లాడ్డడం సరికాదు.దక్షిణాది భారతీయుల, బెంగాలీల మనోభావాలను దెబ్బ తీశారని మోడీపై కేసు పెడితే అనర్హులుగా ప్రకటించేస్తారా..?రాహులును మాట్లానివ్వకుండా ఉండేందుకే బీజేపీ కుట్ర. రాహుల్ కు అండగా పార్టీలన్నీ ఏకతాటి మీదకు వస్తున్నాయి.. జాతీయ ఉద్యమంగా మారుతోంది. రాహులును దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారు.
రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి చంద్రబాబు కలిసి రావాలి.అవసరమైతే చంద్రబాబుని కలవడానికి అభ్యంతరం ఏంలేదు.గత ఎన్నికల సమయంలో మా నాయకుడు అశోక్ గెహ్లత్ చంద్రబాబును కలిశారు.ఇప్పుడు రాహులుకు సంఘీభావం తెలపాలని కోరినట్టే పోలవరం విషయంలో కూడా చేతులు జోడించి సహకరించాలని పార్టీలను కోరాను.
Read Also: Minister KTR: మెట్రోరైల్ ప్రాజెక్ట్ రెండో దశ సాధ్యం కాదన్న కేంద్రం.. మంత్రి కేటీఆర్ ఆగ్రహం