టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నాడు… రీసెంట్ గా ఈ హీరో నటించిన క్రేజీ మూవీ ‘ఖుషి’సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.. దీంతో ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు..విజయ్ దేవరకొండ లైగర్ ప్లాప్ తో కాస్త నిరాశ చెందాడు. దీంతో ఖుషి సినిమాపై ఎంతో నమ్మకంగా వున్నాడు రౌడీ హీరో.ఆయన ఫ్యాన్స్ కూడా ఖుషి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కు జంటగా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా సాంగ్స్ చాట్ బస్టర్ గా నిలిచాయి.
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ,సమంత జంటకు మంచి క్రేజ్ ఏర్పడింది.వీరి కెమిస్ట్రీని తెరమీద చూడాలని ప్రేక్షకులు అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.సినిమా విడుదల దగ్గర పడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచాలని చూస్తున్నారు..ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను చేసాడు.అందులో 8 రోజులు, 14 రోజులు, 30 రోజులు అంటూ విజయ్ దేవరకొండ ఒక ట్వీట్ చేయగా ఇందులో 8 రోజులు అనేది ట్రైలర్ విడుదల తేదీ అని అంతా అనుకుంటున్నారు.ఇక 14 రోజులు అంటే ఏంటో తెలియాల్సి ఉంది.అలాగే 30 రోజులు అంటే సినిమా విడుదల తేదీ అని తెలుస్తుంది..మొత్తానికి విజయ్ అలా హింట్ ఇచ్చేసాడు.మరి విజయ్ దేవరకొండ ఇచ్చిన హింట్ ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 9న విడుదల అవుతుందో లేదో చూడాలి..
https://twitter.com/TheDeverakonda/status/1686371573727670273?s=20