విజయ్ దేవరకొండ, సమంత జంట గా నటించిన తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తి అయింది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.గత ఏడాది విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా తీవ్రం గా నిరాశ పరిచింది..విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలవడం తో ప్రస్తుతం చేస్తున్న ఖుషి సినిమా పైనే విజయ్ దేవరకొండ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు. ఖుషి సినిమా ను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే విడుదల అయిన పాటలు.మరియు పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు చాలా ఉన్నాయనీ తెలుస్తుంది.. అందుకే ఖుషి సినిమా ను భారీ ఎత్తున ప్రమోట్ చేయాలని విజయ్ దేవరకొండ అభిమానులు కూడా కోరుతున్నారు.కానీ సమంత మయోసైటీస్ డిసీజ్ కు మరోసారి ట్రీట్మెంట్ తీసుకోవడానికి విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం.దాంతో ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఆమె హాజరు అవ్వదని తేలిపోయింది.
అంతే కాకుండా ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమాకు కాస్త ముందు గానే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయాలని అభిమానులు కోరుకుంటున్నట్లు సమాచారం.చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఆగస్టు 15 నుండి షురూ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.. సినిమా కు సంబంధించిన మొదటి ప్రమోషనల్ మీడియా మీట్ ను ఆగస్టు 15 సందర్భంగా ఏర్పాటు చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. అదే సమయం లో సినిమా కి సంబంధించిన ఒక కీలకమైన ఒక వీడియోను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 1వ తేదీన ఖుషి సినిమా విడుదల అవ్వబోతుంది. ఈ నేపథ్యం లో ప్రమోషన్ కార్యక్రమాలు కేవలం రెండు వారాలు మాత్రమే చేస్తే ఎలా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.