Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే.. ఈ ట్రావెల్స్ బస్సు మూసా పేట్ నుంచి 9.30 కి స్టార్ట్ అయ్యింది. ఆరంఘడ్ చౌరస్తా నుంచి రాత్రి 11గంటల తర్వాత బయలుదేరింది. బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి 30 మంది ప్రయాణికులు బయల్దేరారు. డ్రైవర్, సబ్ డ్రైవర్, క్లీనర్‌తో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. ఇందులో దాదాపు 20 మంది మృతి చెందినట్లు చెబుతున్నారు. తాజాగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ రామారెడ్డి అనే వ్యక్తి మాట్లాడారు. డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని తెలిపారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: మన ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం.. పవన్ కల్యాణ్ పిలుపు..
హైదరాబాద్‌లో చికిత్స కోసం వచ్చినట్లు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామారెడ్డి తెలిపారు.. “బెంగుళూరు లో కూతురు LLB చేస్తోంది.. పాపను చూడటానికి వెళ్తున్నాను.. గాఢ నిద్రలో ఉన్నాను.. ఒక్కసారిగా బస్సులో అరుపులు, కేకలు వినిపించాయి.. లేచి చూసే సరికి బస్సు అంతా దట్టమైన పొగ, మంటలు, ప్రయాణికులు అంతా లాస్ట్ సీట్ వైపు వచ్చారు.. పొగ లో ఏం కనిపించలేదు.. ఎవరో కిటికీలోంచి నన్ను బయటకు లాగారు.. బస్సుకి కొద్ది దూరం వరకు వచ్చాం. కళ్ళ ముందే బస్సు తగలబడిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులు కొందరు సజీవ దహనం అయ్యారు… ఎవరో ఇన్నోవా కారులో మమ్మల్ని తీసుకెళ్లి.. కర్నూలు ఆస్పత్రిలో చేర్చారు.. ఉదయం 6 గంటలకు స్పృహ వచ్చింది.. ఇంట్లో వాళ్లకు కాల్ చేసి చెప్పాను.. సేఫ్ గానే ఉన్నాను అని.. బస్సు తగలబడుతుంటే.. పక్క నుంచే ఎన్నో వెహికల్స్ వెళ్ళాయి కానీ.. చూసి చూడనట్టు వెళ్ళిపోయారు.. కొందరు వచ్చి కాపాడారు.. డ్రైవర్, సబ్ డ్రైవర్, క్లీనర్ అసలు అక్కడ కనపడలేదు.. చిన్నగా మంటలు స్టార్ట్ అవగానే మమ్మల్ని అలెర్ట్ చేసి ఉంటే.. ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు..” అని రామారెడ్డి వెల్లడించారు.