జనవరి 30 గాంధీని హత్య చేసిన రోజు అని, ఆ రోజు భారతదేశ మొత్తం లౌకిక విధానాన్ని రక్షించాలని సీపీఐ జాతీయ కమిటీ కోరుతుందన్నారు సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు కూనంనేమి సాంబశివ రావు. ఆదివారం ఆయన ఖమ్మం సీపీఐ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ పాలన, అభివృద్ధిని పక్కనపెట్టి మతపరమైన భావజాలం పెంపొందిస్తుందని ఆరోపించారు. ఈ రోజు గాడ్సేకు గుడి కట్టే దశకు వెళ్లిపోయారని ఆయన మండిపడ్డారు. భిన్న సంస్కృతులు ఉన్న మన దేశాన్ని 1925 లో పుట్టిన ఆర్ఎస్ఎస్ హిందూయిజంగా మార్చిందని, ఇతర రాజ్యాంగాలు చూసి మన దేశ రాజ్యాంగాన్ని రచించారన్నారు. రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని లౌకిక దేశంగా ఉంచాలని చూశారు.. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారన్నారు.
Also Read : Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ సిద్ధంకండమ్మా.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేస్తున్నాడు
కమ్యూనిస్టులుగా దేశాన్ని కాపాడుకునే బాధ్యత మాపైన ఉందని, మా దేహం బద్ధులైన భారతదేశాన్ని విచ్ఛిన్నం కానియమన ఆయన వ్యాఖ్యానించారు. మోడీ మీద తీసిన డాక్యుమెంటరీ నీ బలవంతంగా విడుదల చేయకుండా చేశారని, ఆదాని అనేది ఒక గాలి బుడగ లాంటి ఆర్థిక వ్యవస్థ అని, సత్యం కంపెనీ లాగానే ఇప్పుడు ఆదాని కంపెనీ పని అయిపోయిందని ఆయన అన్నారు. డబ్బులు అన్ని ఆదాని కంపెనీలో వాటగా పెట్టించారని, ప్రభుత్వ రంగాన్ని బతికించండి.. ఆదాని, అంబానీ కంపెనీలో ఉన్న వాటాలను వెనక్కు ఇప్పించండని ఆయన కోరారు.
Also Read : Petrol Rates : భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర.. ఏకంగా రూ.35పై మాటే
మతాల్లోకి దేవున్ని లాక్కండి ఎవరి విశ్వాసాలకు వారిని వదిలేయండని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తున్నాం మా వాళ్ల మీద 123B లాంటి కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తుపాకులు తీసుకొని ప్రభుత్వం మీద యుద్ధానికి పోతున్నామని ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారని, అలాంటి కేసులు పెట్టవద్దు.. అలాంటి కేసులు పెడితే మాత్రం ఊరుకునేది లేదని ఆయన అన్నారు. మాలాంటి వారి మీద కేసులు పెట్టండి అమాయకుల మీద పెట్టవద్దని, పొత్తుకు పోరాటాలకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.