బీఆర్‌ఎస్ మాకు మిత్రులు గానే చూస్తున్నామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కూడా మాకు మిత్రులేనని, కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారనే మాట హరీష్ ఎందుకు అన్నారో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడులో గెలిచినప్పుడు తెలియదా..? అని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టులు లేకుంటే మునుగొడులో గెలిచే వారా..? అని ఆయన ప్రశ్నించారు. మునుగొడులో మేము లేకుంటే.. బీజేపీ గెలిచేదని, బీజేపీని కట్టడి చేయడం బీఆర్‌ఎస్ వల్ల అయ్యేదా..? అని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో కలిసి పని చేస్తామా లేదా అనేది చెప్పలేమని ఆయన వెల్లడించారు.
Also Read : Pawan Kalyan: షూటింగ్ అయ్యేవరకు పవన్ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు
సీపీఐ, సీపీఎం పార్టీలు అయితే కలిసే పని చేస్తాయని, హరీష్ అన్నట్టు మాకు ప్రతి నియోజకవర్గంలో అంగన్ వాడీ.. ఆశ కార్యకర్తలు అయినా ఉంటారు కదా..? అని ఆయన అన్నారు. మేము ప్రభావం చూపే జిల్లాలు లేవా..? అని ఆయన అన్నారు. తెలంగాణలో ఏ గ్రామం వెళ్ళినా, ఏ నియోజకవర్గం వెళ్ళినా ఇప్పటికీ కూడా కమ్యూనిస్టులు లేని ప్రాంతం ఒక్కటైన చూపెట్టగలుగుతారా అని ప్రశ్నించారు. డబ్బు రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిధ్యం తగ్గవచ్చునేమోగాని, కమ్యూనిస్టులు లేని సమాజాన్ని హరీష్‌రావు కూడా ఊహించుకోలేరని పేర్కొన్నారు. సమస్య ఎక్కడ ఉంటే కమ్యూనిస్టులు అక్కడ ఉంటారని, ఆ సమస్య పరిష్కారానికై ప్రశ్నిస్తారని వారు అన్నారు. ఆవిధంగా ప్రశ్నించే ప్రతిఒక్కరూ కమ్యూనిస్టే అని కూనంనేని ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read : Samuthirakani: దానివల్లే త్రివిక్రమ్ నాకు సపోర్ట్ చేశాడు.. లేకపోతే!