Site icon NTV Telugu

Kumari Aunty : ముఖ్యమంత్రి సహాయనిధికి కుమారి ఆంటీ విరాళం.. ఎంతంటే..!

Kumari Aunty

Kumari Aunty

ఇటీవల భారీ వర్షాల బీభత్సానికి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. అయితే.. ముంపు బాధితులను ఆదుకోవడానికి తమకు తోచినంత ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కుమారి అంటీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేశారు. కుమారీ ఆంటీ తన కుమార్తెతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డికి రూ.50 వేల చెక్కును అందజేశారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.20లక్షలు విరాళం అందజేసింది టెక్నో పెయింట్స్ సంస్థ.
Haryana Election: మహిళలకు నెలకు రెండు వేలు.. పేదలకు వంద గజాల భూమి

జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని టెక్నో పెయింట్స్ డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాస్ రెడ్డి, సీవీఎల్ఎన్ మూర్తి, అనిల్ కొండోత్ కలిసి చెక్ అందజేశారు. నిన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం అందించారు. అంతేకాకుండా, చిరంజీవి తన కుమారుడు, నటుడు రామ్ చరణ్ తరపున మరో రూ.50 లక్షలను కూడా అందజేశారు. ఇదే కాకుండా.. నటుడు అలీ సీఎం సహాయనిధికి రూ. 3 లక్షలు విరాళంగా అందజేశారు.

One Nation-One Election: వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కి కేంద్రం ఆమోదం..

Exit mobile version