NTV Telugu Site icon

Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన కుమారస్వామి

Hd Kumaraswamy

Hd Kumaraswamy

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఖండించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఆరోపిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలకు స్పందిస్తూ, కుమారస్వామి గురువారం ఎక్స్ ద్వారా వెల్లడించిన తన స్పందనలో, ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తోందనే ఆరోపణలు నిరాధారమని, సత్యదూరమని స్పష్టం చేశారు.

 
Rashid Khan: ఘనంగా పెళ్లిచేసుకున్న స్టార్ అల్ రౌండర్.. హాజరైన క్రికెటర్లు!
 

అతను తెలిపిన వివరాల ప్రకారం, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన 48 గంటల్లోనే తిరిగి వారిని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 27న తొలగించిన 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను 29వ తేదీన మళ్లీ విధుల్లోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనాలు , ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ అంశాన్ని వాడుకోవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

ఇక కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి గురించి మాట్లాడతే, ఇప్పటివరకు రద్దు చేసిన 3,700 మంది కాంట్రాక్ట్ లేబర్ పాసులను త్వరలో ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా పునరుద్ధరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం స్పష్టం చేసింది. అంతేకాక, కార్మికుల బయోమెట్రిక్ డేటాను త్వరలో పునరిద్ధరించనున్నామని కుమారస్వామి తెలిపారు.

Tirumala: నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు… తిరుమలలో ట్యాక్సీలకు అనుమతి నిరాకరణ
గేట్ పాస్ వ్యవస్థతో పాటు, అవసరమైన సౌకర్యాలను కొనసాగించేందుకు అన్ని పక్షాలీ చర్చల సమయంలో అంగీకరించాయని ఆయన చెప్పారు. మొత్తం మీద, ఎన్డీఏ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తోందనే ఆరోపణలు అసత్యం అని, ప్రభుత్వ రంగ సంస్థలను సమర్ధంగా నిర్వహించడం ద్వారా గత మూడేళ్లలో వాటి షేర్ విలువ అద్భుతంగా పెరిగిందని మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ఇది కాకుండా, బాధిత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.