Kuldeep Yadav bamboozles Jos Buttler with brilliant delivery: టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇటీవలి కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2023 సహా ఆపై భారత్ ఆడిన సిరీస్‌లలో సత్తాచాటాడు. ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 5 వికెట్స్ పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుత ప్రదర్శనతో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో చోటుదక్కిన్చుకున్న కుల్దీప్.. అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. బంతితో మ్యాజిక్ చేస్తూ వికెట్స్ పడగొడుతున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టన్నింగ్ డెలివరీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఆదివారం లక్నోలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను భారత్ 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లీష్ జట్టు 34.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ స్నేక్ బాల్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఊహించని రీతిలో టర్న్ అయిన బంతిని చూసి బట్లర్ బిత్తరపోయాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: Telangana News: విమానం ఎక్కుతుండగా గుండెపోటు.. సర్పంచి భార్య మృతి!
16వ ఓవర్ తొలి బంతిని కుల్దీప్ యాదవ్ వేయగా.. బంతిని అంచనా వేయడంలో జోస్ బట్లర్ విఫలం అయ్యాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌లో పిచ్ అయిన బంతి.. అనూహ్యంగా టర్న్ అయి మిడిల్ స్టంప్‌ను ఎగరగొట్టింది. బంతి టర్న్ కాదనుకున్న బట్లర్.. బ్యాక్ ఫుట్ తీసుకుని షాట్ ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు. బంతి 7.2 డిగ్రీలు టర్న్ అవడంతో బట్లర్ ఫ్యూజులు అవుట్ అయ్యాయి. క్రీజులో కుదురుకున్న బట్లర్ అవుట్ అవ్వడంతో భారత ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్ కుల్దీప్ మ్యాజిక్ బంతికి ఫిదా అవుతున్నారు. ‘బాల్ ఆఫ్ ది వన్డే ప్రపంచకప్ 2023′, ;’బాల్ ఆఫ్ ది ఇండియా’ అని కామెంట్ చేస్తున్నారు.
क्या कोई बता सकता है कि कुलदीप यादव को टीम से बाहर क्यों रखा जा रहा था#KuldeepYadav
— Sanjay Kishore (@saintkishore) October 29, 2023