Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kukatpally Woman Allegations Accused Response Hyderabad Police Investigation Update

Hyderabad: “నజీరాగా పేరు మార్చి కల్మా చదివించారు, బీఫ్ తినిపించారు”.. లవ్ జిహాద్ బాధితురాలి ఆవేదన..

Published Date :April 16, 2026 , 1:11 pm
By RAMAKRISHNA KENCHE
Hyderabad: “నజీరాగా పేరు మార్చి కల్మా చదివించారు, బీఫ్ తినిపించారు”.. లవ్ జిహాద్ బాధితురాలి ఆవేదన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఓ యువతి లవ్‌ జిహాద్ వలకు చిక్కుకుంది. ఈ మేరకు ఆమె కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ.. నిందితుడు తాను మోసం చేయలేదని ప్లేట్ మారుస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ అమ్మాయే తనను ట్రాప్ చేసిందని నమ్మించేందుకు ట్రై చేశాడు. లవ్ జిహాద్ ఆరోపణలను కొట్టిపారేశాడు. దీంతో బాధితురాలు మరోసారి మీడియా ముందుకు వచ్చింది. లవ్ జిహాద్ నిజమేనని.. తానే బాధితురాలిని అని స్పష్టం చేసింది. నవాజ్ తమ్ముళ్లు మునవార్, షారుక్, ఇస్మాయిల్‌లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించింది. కేసు నమోదు తర్వాత నిందితుడు నవాజ్ హైదరాబాద్ నుంచి నెల్లూరు పారిపోయినట్లు బాధితురాలు తెలిపింది.తనతో బలవంతంగా బీఫ్ తినిపించారని చెబుతోంది. తనను ఎలా చిత్రహింసలు పెట్టారో, ఎలా గ్యాంగ్ రేప్ చేశారో పూర్తి వివరాలు బయటపెడతానని బాధితురాలు చెబుతోంది. ఈ మేరకు తాజాగా ఆమె మీడియాతో మాట్లాడింది.

READ MORE: MLA Adimulam: ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడి సంచలన వ్యాఖ్యలు.. ఆ డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా..!

“సాఫ్ట్ వేర్‌ డెవలపర్‌గా పని చేస్తున్నాను. నవాజ్‌కు అప్పటికే రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. నెల్లూరుకు చెందిన నవాజ్ 2025 మేలో పరిచయమయ్యాడు. కుక్కట్ పల్లిలో ట్రేడింగ్ సొల్యూషన్స్ పేరుతో మా షాప్ దగ్గర బిజినెస్‌ స్టార్ట్ చేశాడు. మాకు పరిచయమైన తరువాత హిందువు లాగా మారానని చెప్పాడు. బిజినెస్ పేరుతో మా కుటుంబానికి దగ్గరగా చేరాడు. ట్రేడింగ్, ఫుడ్ బిజినెస్ పేరుతో మూడు రోజులపాటు మాతో మాట్లాడాడు. హిందువుగా మారిపోయినట్టు నాకు సర్టిఫికెట్ సైతం చూపించాడు. నవాజ్ నుంచి నవదుర్గగా మారినట్లు సర్టిఫికెట్ చూపించాడు.. నవాజ్ తమ్ముళ్లు కూడా నాకు చెప్పారు. నా కోసం హిందువుగా మారినట్లు నన్ను నమ్మించాడు. గతేడాది జూలైలో నన్ను పెళ్ళి చేసుకున్నాడు. భవిష్యత్తులో దుబాయ్‌కి వెళ్ళిపోతామని చెప్పాడు. పెళ్ళి సమయంలో నజీరాగా నా పేరును పెట్టారు. కాగా, అక్టోబర్‌లో ఛీటింగ్ చేశాడని తెలిసింది. ఆ విషయం మాకు తెలిసిందని, తను గేమ్స్ స్టార్ట్ చేశాడు. నన్ను చంపుతారు మనం పారిపోదామని నమ్మించాడు. నన్ను బ్లాక్ మెయిల్ చేసేవాడు. నా ఫొటోలను, వీడియోలు అతడి దగ్గర ఉన్నాయి, అవి చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. గుల్బర్గాలో ఖాజా నవాజ్ దర్గా దగ్గరికి తీసుకువెళ్లి నా మతం మార్పించాడు. చెప్పిన మాట వినకపోతే నన్ను కొట్టేవాడు. నాతో కల్మా చదివించాడు. నెల్లూరు అడ్రస్ పేరుతో శంషాబాద్‌లో ఓ ఫ్లాట్ ఉంది, అది కూడా అమ్మేశాడు. నా గోల్డ్ మొత్తం ముత్తూట్‌లో పెట్టాడు. నా పేరు మీద‌ లోన్లు తీసుకున్నాడు. నాతో ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పాడు. అక్టోబర్ 10 బెంగుళూరు వెళ్ళాము. బాండ్ చూపించి డబ్బులు రావాలి, వెళ్ళి వస్తా అని చెప్పాడు. నైట్ వరకు రాలేదు. ఆ రోజు రాత్రి చైన్నై దగ్గర ఉన్నానని చెప్పాడు. అప్పుడే అనుమానం వచ్చింది. బేగంపేట్‌లో నాకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే అమ్మను, చెల్లెలిని చంపుతానని బెదిరించాడు. లవ్ జిహాద్ అనేది నిజమే. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. నేనే బాధితురాలిని నా వీడియోలు ఫోటోల కోసమే ఇంతకాలం వాళ్ళ బెదిరింపులకు బెదిరిపోయాను . కానీ ఇక నాకు జరిగింది చాలు ఇంకొకరికి జరగకుండా ఉండాలనే ధైర్యంగా బయటికి వచ్చి చెప్తున్నాను.” అని బాధితురాలు కన్నీరు మున్నీరుగా తన కథను వివరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • accused denial video case
  • cheating assault case India
  • crime update India
  • Hyderabad Kukatpally case update
  • Hyderabad police news

తాజావార్తలు

  • Yuvraj Singh: అభిషేక్ శర్మతో పాటు.. అతడు కూడా యువరాజ్ సింగ్ శిష్యుడే.. ఓపెనింగ్‌లో దబిడిదిబిడే..

  • Medigadda : మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కారు నజర్.. 20న సీఎం రేవంత్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ పర్యటన.!

  • Gold vs Stocks: “గోల్డ్ కంటే ‘స్మార్ట్’గా పెరిగిన స్టాక్స్ ఇవే! ఈ రెండు షేర్లు కొన్నవారికి కాసుల వర్షం”

  • Rahul Gandhi: ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, బీజేపీ అధికారాన్ని శాశ్వతం చేసే బిల్లు..

  • Shefali Bagga: ‘చాహల్‌ వద్దు.. విరాట్ లాంటి వాడు కావాలి’ మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ..

ట్రెండింగ్‌

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..

  • 8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!

  • T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions