NTV Telugu Site icon

Bandi Ramesh: భర్త గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం.. రోడ్ షోలో పాల్గొన్న బండి లకుమాదేవి

Bandi Ramesh

Bandi Ramesh

కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ మోతినగర్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్తి బండి రమేష్, ఆయన సతీమణి లకుమాదేవితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. భర్త గెలుపే లక్ష్యంగా సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలు అందేలా పక్కా ప్రణాళికతో లకుమాదేవి ఇంటింటా ప్రచారం చేశారు.

Read Also: MLA Laxmareddy: తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి గడపకు సంక్షేమ ఫలం అందింది..

ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ.. ప్రజలే మా బలగం.. కార్యకర్తలే మా బలం అని అన్నారు. కాబట్టి సోనియమ్మ మనకు మళ్ళీ రావాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలని లకుమాదేవి కోరారు. అంతేకాకుండా.. మహిళా కార్యకర్తలతో బతుకమ్మ ఆటపాటలతో చిందులు వేస్తూ గెలుపు లక్ష్యంగా మనం పని చేయాలని తెలిపారు. అన్ని రంగాలలోనూ మహిళలకు ప్రధాన పాత్ర మన సోనియమ్మ కల్పిస్తుంది అని అన్నారు.

Read Also: Bhatti Vikramarka: మాదాపూర్, హైటెక్ సిటీలా.. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి…

అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ.. కార్యకర్తలు ఇండియా సరిహద్దులలో సైనికుల్లాగా ఈ వారం రోజులు పని చేయాలి అని అన్నారు. అందరు అర్ధం చేసుకుని అలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని.. సోనియాగాంధీకి, రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తారని కోరారు. కూకట్ పల్లిలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాను.. మాట ఇస్తున్నానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ ఎలాగైతే కూలిందో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాగే కూలిపోతుందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.. మీకు మీ సమస్యలకు అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు మరియు యువకులు, తదితరులు పాల్గొన్నారు

Show comments