Site icon NTV Telugu

KTR: ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదు.. నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోంది

Ktr

Ktr

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదు. నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోంది. ఇదే కాంగ్రెస్‌ పాలన అని తీవ్ర విమర్శలు చేశారు. నీళ్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు పాత్ర చాలా కీలకం.. కేసీఆర్ వెనుకాల ఉండి ఆ ప్రాజెక్టు ను విజయవంతంగా పూర్తి చేశారు.. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే రాద్ధాంతం చేస్తున్నారు.

Also Read:Hanumakonda: వాహ్ ఏం ఐడియా సర్.. అధిక సౌండ్ చేసే సైలెన్సర్లతో ఏం చేశారో చూడండి..

కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై నీళ్లు ఇచ్చిన కేసీఆర్ పై అబండాలు వేస్తున్నారు.. అందుకే అందరికి అర్థం అయ్యేలా చెప్పాలని నేను హరీష్ రావుకు చెప్పానని తెలిపారు. నీళ్ల విషయంలో కృష్ణా, గోదావరిలో ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టి చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కాలంతో పోటీపడి కట్టినం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90 శాతం పూర్తిచేసినం. సీతారామ ప్రాజెక్టును కూడా 90 శాతం పూర్తిచేసి తెలంగాణ రైతాంగం ప్రయోజనం కోసం కేసీఆర్‌ సర్కార్ నిరంతరం పనిచేసిందన్నారు.

Exit mobile version