NTV Telugu Site icon

Formula E- Race Case: లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసు విత్ డ్రా చేసుకున్నాం- అడ్వకేట్..

Ktr

Ktr

తమ లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసును విత్ డ్రా చేసుకున్నట్లు కేటీఆర్ అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు. ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా అప్పీల్ చేసుకునేందుకు తమకు అవకాశం ఉందని చెప్పారు. ఫార్ములా ఈ కార్ కేసులో సుప్రీం కోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపిందని అన్నారు. కేటీఆర్ క్యాష్ పిటిషన్ పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు.. ఈ కేసులో సెక్షన్ 13.1A పీసీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించామని చెప్పారు. ఏసీబీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న అంశాలు ప్రొసీజర్‌లో ఉన్న ఇరెగ్యులారిటీకి సంబంధించిన అంశాలని అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు.

Read Also: TG Exams: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు..

మరోవైపు.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇంఛార్జ్ సోమ భరత్ కూమార్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిందన్న వార్తలను ఖండిస్తున్నామని తెలిపారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై కొన్ని మీడియా ఛానెల్స్ వక్రీకరించడం దురదృష్టకరం అని అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ- రేస్‌ను హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు బీఆర్ఎస్ హయంలో నిర్వహించారని అన్నారు. ఇందులో అవినీతి జరిగిందని కేటీఆర్ పైన ఈ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.. చట్టాన్ని గౌరవిస్తూ ఏసీబీ కేసు విచారణలో భాగంగా కేటీఆర్ సహకరిస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఈరోజు క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్నాం.. ముందస్తు బెయిల్‌కు వెళ్లే విషయంలో ఇంకా ఆలోచన చేయలేదని అన్నారు. ఒకవేళ ముందస్తు బెయిల్ కోసం వెళితే చెబుతాం.. ముందస్తు బెయిల్ తీసుకోవచ్చని చట్టంలోనే ఉంది.. అలా వెళ్లినా తప్పు పట్టాల్సిన అవసరం లేదని సోమ భరత్ కుమార్ అన్నారు.

Read Also: BJP On Rahul Gandhi: కాంగ్రెస్ నీచ వైఖరి బయటపడింది.. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

ఈరోజు ఫార్ములా ఈ రేసు కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే.. కేటీఆర్ తరఫున సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ముఖుల్ రోహిత్గి హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. “విచారణ ప్రాథమిక దశలోనే ఉంది.. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేం.. ప్రత్యామ్నాయ మార్గాలు మీకు ఉన్నాయి కదా..” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో.. పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటామని కేటీఆర్ తరపు న్యాయవాది తెలిపారు.

Show comments