Site icon NTV Telugu

KTR: సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరిపేందుకు కుట్ర..

Ktr

Ktr

KTR:హైదరాబాద్, సికింద్రాబాద్ కు ఎంతో చరిత్ర ఉందని.. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తొలగించే విధంగా చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం.. ప్రత్యక్షంగా తుగ్లక్ అంటే ఎలా ఉంటాడో కనిపిస్తుందని విమర్శించారు. మొట్టమొదటి పని టీఎస్‌ను టీజీగా చేశారు.. దీనివల్ల ఏ పేదవాడికి న్యాయం జరిగిందో తెలియదు.. తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టారన్నారు. ప్రజల దగ్గరికి పాలన పోవాలని అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని వీకేంద్రీకరణను ఒక విశాల దృక్పథంతోనే కేసీఆర్ ప్రారంభించారని.. కొత్త గ్రామాలు మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారని.. హైదరాబాదులోనూ వార్డులను జోన్లను పెంచడం జరిగిందన్నారు. వాటికి అభివృద్ధి నిధులను కూడా అధికంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వం చిహ్నాలు.. కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న తుగ్లకు నిర్ణయం వలన సికింద్రాబాద్‌కి చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేటట్లు ఉన్నదని అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రజలంతా సంఘటితమై.. మా పార్టీని ఆహ్వానించడం జరిగిందని.. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం మా పార్టీకి చెందిన వార అన్నారు.

READ MORE: Rahul Gandhi: ఇండోర్‌లో అతిసార బాధిత కుటుంబాలకు రాహుల్‌గాంధీ పరామర్శ

సికింద్రాబాద్లో పుట్టిన బిడ్డలుగా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్నారు.. అధికారం ఇచ్చింది పట్టణాల అస్తిత్వాలను ప్రజల అస్తిత్వాలను గుర్తు లేకుండా చేరుపడం కోసం కాదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.. “అధికారం ఇచ్చింది గ్యారెంటీలను అమలు చేయడానికి అధికారం ఇచ్చింది ప్రజలు వారికి మంచి చేయాలని.. కానీ ఇలాంటి ఒక్క పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేయడం లేదు.. హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరాలుగా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు.. ఒక్క రోడ్డు కూడా వేయలేదు ఒక ఇల్లు కూడా కట్టలేదు.. కానీ నగరం మొత్తం తన విధ్వంసం ప్రణాళికలతోని ముందుకు పోతున్నారు.. ఈరోజు శాంతి ర్యాలీ పేరుతో సికింద్రాబాద్ ప్రజలు ప్రజాప్రతినిధులు ఒక కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టారు.. ప్రజల కోరిక మేరకు ప్రజాప్రతినిధులని కోరిక మేరకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తామని సిద్ధంగా ఉన్నాం.. కానీ నిన్న రాత్రి వరకు అనుమతి ఉందని చెప్పి, ఇప్పుడు అనుమతి లేదని చెప్పి వేలాది మందిని కార్పొరేటర్లను, మాజీ కార్పొరేటర్ లను పార్టీ సీనియర్ నాయకులను సాధారణ ప్రజలను ఎక్కడికి అక్కడ అరెస్టు చేశారు.. ఇంత అరాచకంగా అక్రమంగా పనిచేస్తున్న ప్రభుత్వం అధికారం శాస్వతంగా కాదని గుర్తుపెట్టుకోవాలి.. ఇప్పుడున్న పదవిలో ఎల్లకాలం కొనసాగరు.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Exit mobile version