Site icon NTV Telugu

KTR: కాంగ్రెస్ పాలనలో ముప్పు పొంచి ఉంది..శాంతిభద్రతలు క్షీణించాయి!

Ktr

Ktr

KTR: హైదరాబాద్‌లో ఇటీవల శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. పగటిపూట నగరంలోని జ్యువెలరీ షాపులో గన్‌పాయింట్ దోపిడీ జరగడం, కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేయడం ప్రజలలో భయాందోళనలు కలిగించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు పొంచి ఉందని.. శాంతిభద్రతలపై ప్రభుత్వం కనీస దృష్టి సారించడం లేదంటూ ప్రకటన విడుదల చేశారు. సమర్థవంతమైన తెలంగాణ పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ప్రజలకు భద్రత కావాలి గాని, భయం కాదంటూ ప్రకటనలో పేర్కొన్నారు.

Trump-Zelensky: వైట్‌హౌస్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ నవ్వులు.. పువ్వులు.. వీడియో వైరల్

ఇక మరోవైపు, రాజేంద్రనగర్ సర్కిల్ (TGSPDCL) సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీరామ్ మోహన్ బండ్లగూడ, మైలార్ దేవ్ పల్లి ఘటనపై స్పందించారు. దాదాపు 23 అడుగుల ఎత్తున్న గణేష్ విగ్రహం తరలింపు సమయంలో జరిగిన ప్రమాదంలో విద్యుత్ శాఖ కారణమని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవించలేదని.. ట్రాలీపై ఉన్న వ్యక్తులు కిందపడటంతో తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. పైగా ఉన్న 33 కెవి విద్యుత్ లైన్ తెగడం గాని, వేలాడడం గాని జరగలేదని తేల్చారు. విద్యుత్ శాఖకు సంబంధం లేని విషయం ఇదని.. అయినప్పటికీ, ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.

Mithun Chakraborty : 45 కోట్ల విలాస భవంతిని కుక్కల కోసం డొనేట్ చేసిన స్టార్ హీరో !

Exit mobile version