కరీంనగర్‌లో ఒక్క బడి తేలేదు అని, కనీసం గుడి కూడా తేలేదని.. అయినా కరీంనగర్ వాసులు బీజేపీకే ఓటు వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ మోసం దేవుడు రాముడికి కూడా అర్థం అయిందని, అందుకే అయోధ్యలో బీజేపీని ఓడగొట్టారని ఎద్దేవా చేశారు. అవసరం లేకున్నా వేసిన జీఎస్టీని తీసేసి పండుగ చేసుకోండి అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈరోజు కేటీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమ్ రెడ్డిలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘బీజేపీ ప్రభుత్వం అవసరం లేకున్నా వేసిన జీఎస్టీని తీసేసి పండుగ చేసుకోండి అంటున్నారు. ప్రధాని మోడీ చెప్పినట్లు పదిహేను లక్షలు ఏమయ్యాయి. దేవుని పేరు చెప్పి ఓట్లు వేసుకోవడం ఒక్కటే బీజేపీకి తెలుసు. దేవుని పేరు చెప్పారని కరీంనగర్‌లో కూడా బీజేపీని గెలుపించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం అవుతున్నాం. కరీంనగర్‌లో ఒక్క బడి తేలేదు, కనీసం గుడి కూడా తేలేదు. అయినా కరీంనగర్ వాళ్లు బీజేపీకే ఓటు వేస్తున్నారు. బీజేపీ మోసం ఆ దేవుడు రామునికి కూడా అర్థం అయింది. అందుకే అయోధ్యలో బీజేపీని ఓడగొట్టారు. కానీ కరీంనగర్‌లో మాత్రం బీజేపీనే గెలిపిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు.
Also Read: IND vs BAN: జస్ప్రీత్ బుమ్రాకు నో రెస్ట్.. ఎవరికీ వెసులుబాటు లేదు!
‘కాంగ్రెస్ దొంగ మాటలు హైదరాబాద్ ప్రజలు నమ్మలేదు. కానీ ఊళ్లలో నమ్మి మోసపోయారు. చాలా మంది మా ఎమ్మెల్యే ఓడిపోయినా.. కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు. అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారు. బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ ప్రబుత్వాన్ ఆగమాగం చేసింది’ అని సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
