Site icon NTV Telugu

KTR : రేవంత్ అబద్ధాల హామీలు అమలు ఎప్పుడు చేస్తారు

Ktr

Ktr

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇవాళ కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరీంనగర్ గతంలో ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా సింహ గర్జన సభ వేదిక అయిందని, ప్రస్తుతం అబద్ధాల రేవంత్ కి వ్యతిరేకంగా కదనభేరి నిర్వహిస్తున్నామన్నారు. జేబులో కత్తెర్లు పెట్టుకుని తిరుగుతున్న అని జేబుదొంగ లాగా మాట్లాడుతున్నాడు రేవంత్ అని, మానవ బాంబులు అవుతాం అని రేవంత్ అంటున్నారు.. మీ ప్రభుత్వాన్ని కూల్చే బాంబులు ఖమ్మం బాంబు, నల్గొండ బాంబు మీ పార్టీలోనే ఉన్నాయన్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని మేము కూల్చము… ఆయన ఐదేళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నామన్నారు కేటీఆర్‌. మీరిచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయాలని కోరుతున్నామని, రేవంత్ అబద్ధాల హామీలు అమలు ఎప్పుడు చేస్తారన్నారు.

అంతేకాకుండా..’రేవంత్ మగాడు అయితే మల్కాజిగిరి కి వచ్చి పోటీ చెయ్.. గెలువు. దమ్ముంటే మొగాడివైతే ఇచ్చిన హామీలని అమలు చెయ్యి.. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యి… ఎండుతున్న పంటలకు నీళ్లు ఇవ్వు మొగాడివైతే. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా గుజరాత్ మోడల్ అంటున్నారు రేవంత్ సిగ్గుందా. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ బేకార్ మాడల్ అంటారు… గుజరాత్ మోడల్ అంటే రైళ్లను తగలబెట్టడమా? కాలం కాలేదు కరువు వచ్చింది అంటున్నారు ఇది కాలం కాని కరువు కాదు… ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు… తెలంగాణ భౌగోళిక వాతావరణ పరిస్తితి పై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ అందుకే ప్రాజెక్టులు కట్టారు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఈ పిచ్చోళ్ళకు తెలియదు. బండి సంజయ్ కి, రేవంత్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏమి తెలియదు. మెడిగడ్డలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయి…

దాన్ని రిపేర్ చేయకుండా రాద్దాంతం చేస్తున్నారు. కరీంనగర్ నుంచి బద్దం ఎల్లారెడ్డి, చొక్కారావు కేసీఆర్ లాంటి హేమాహేమీలు ఎంపీలు అయ్యారు. బండి సంజయ్ లాంటి మహానుభావుడు అటువంటి కరీంనగర్ నుంచి ఎన్నికవడం సిగ్గుచేటు. కరీంనగర్ కి ఏమి చేసావు సంజయ్…? కరీంనగర్ కమాన్ దగ్గర చర్చ చేద్దాం సిద్ధమా. కరీంనగర్ కి ఒక్క బడి తెచ్చినవా? కనీసం ఒక్క గుడి కూడా తేలేదు. నీ తల్లికే నువ్వు పుట్టినవ అని మంత్రి పొన్నంని అనే చిల్లర గాడు సంజయ్ ఎంపీగా అవసరమా? దేశం కోసం ధర్మం కోసం అంటున్న సంజయ్.. ధర్మం కోసం చేస్తే ఓ మఠం పెట్టుకో సంజయ్… ఈ కాంగ్రెస్ రేవంత్ కాంగ్రెస్… ఇది మామూలు కాంగ్రెస్ కాదు. ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మ గా మారడం గ్యారంటీ. కాంగ్రెస్ ని రేవంత్ వీడటం ఖాయం’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Exit mobile version