అసెంబ్లీ సమావేశాల అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. శాసన సభ చరిత్రలో ఎప్పుడు చెప్పని విధంగా అబద్ధాలు చెప్పారని కేటీఆర్ ఆరోపించారు. రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టారు.. రైతుబంధు దుర్వినియోగం అయ్యిందని ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. పత్తి రైతులు ఎనిమిది నెలలు పంట పండిస్తారు.. పత్తి రైతులకు రెండో విడత రైతుబంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు. పత్తి రైతులు, కంది రైతులు మోసపోకండి.. రైతు ఆత్మహత్యలపైనా ఈ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు. రైతుబంధు మొదలయ్యాక రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేటీఆర్ తెలిపారు.
Read Also: Tamil Nadu: దేవుడి హుండీలో పడిన ఐఫోన్.. వ్యక్తికి షాకిచ్చిన ఆలయ నిర్వాహకులు…
రైతు బంధు ఎగ్గొట్టేందుకే క్యాబినెట్ సబ్ కమిటీ అని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ విషయంలో వాళ్ళ డొల్లతనం బయట పడింది.. సీఎం 100 శాతం రుణమాఫీ అయింది అంటే.. వాళ్ళ ఎమ్మెల్యేలే 70 శాతం అని చెప్తున్నారన్నారు. ఏ గ్రామంలో కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదని కేటీఆర్ తెలిపారు. రుణమాఫీ చేయలేదు.. రైతు బంధు ఇవ్వలేదు అని తాము అడిగితే సీఎంకు కోపం వచ్చిందన్నారు. ప్రభుత్వం కాకి లెక్కలు తాము నమ్మడం లేదని కేటీఆర్ అన్నారు. రూ.26,775 కోట్లు రైతు భరోసా రైతులకు భాకీ ఉన్నారు.. రైతు బంధుకు రాంరాం చెప్పే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలసి కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పండని కోరారు.
Read Also: Ujjain: ప్రాణం తీసిన ‘‘దుపట్టా’’.. మిషన్‌లో ఇరుక్కుని మహిళ మృతి..
మరోవైపు.. అసెంబ్లీలో కేసీఆర్ గురించి చాలా చిల్లర మాటలు మాట్లాడారని కేటీఆర్ అన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరని తెలిపారు. 6 గ్యారంటీలు ఇవ్వని కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి అడగండని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమాల పట్ల భయపడుతున్నారన్నారు. మరోవైపు.. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని అన్నారు. ఈడీకి భయపడం.. మోడీకి భయపడమని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేయమని కేటీఆర్ పేర్కొన్నారు. తమకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని చెప్పారు.