KTR: తెలంగాణ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగ విద్యార్థులను పోలీసులతో గొంతు నులిమి, దాడులు చేయించినప్పుడు మీరు ఎక్కడున్నారు రాహుల్ గాంధీ? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. లగచర్లలో గిరిజన మహిళలను వారి భూముల కోసం పోరాడుతున్నందుకు కొట్టినప్పుడు, దుస్తులు చింపి అవమానించినప్పుడు మీకు చలనం కలగలేదా? అని నిలదీశారు. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైడ్రా బుల్డోజర్లతో కష్టపడి జీవిస్తున్న తెలంగాణ ప్రజల ఇళ్లను కూల్చివేస్తున్నప్పుడు మీరు ఢిల్లీలో నిద్రపోతున్నారా? అని మండిపడ్డారు.
కంచ గచ్చిబౌలి హెచ్‌సీయూ భూముల్లో రాత్రికి రాత్రే 10 వేలకు పైగా చెట్లను నరికివేసి, జింకలు, నెమళ్లు సహా విలువైన జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేసినప్పుడు.. కేబీఆర్ పార్కును నాశనం చేస్తున్నప్పుడు మీ గొంతు ఎందుకు పెగల్లేదు? అని కేటీఆర్ ప్రశ్నించారు. “రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను అపహాస్యం చేస్తూ, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మహిళా ప్రజాప్రతినిధుల చీరలు లాగి, అసెంబ్లీ ఎదుటే దాడులు చేసినప్పుడు కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా రాహుల్ గాంధీ? రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల బలవన్మరణాలు, అర్ధరాత్రి వేళ జర్నలిస్టుల అరెస్టులు, కార్పొరేట్ అనుకూల విధానాలు, భూకబ్జాలపై మాట్లాడటానికి మీకు సమయం లేదా?మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అయినా మీ నోరు ఎందుకు మెదపడం లేదు? అవసరమైనప్పుడు మౌనం వహించారు.. ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రజల సొమ్ము రూ. 100 కోట్లతో ప్రచార ఆర్భాటం కోసం సిగ్గులేకుండా వచ్చారా? రాహుల్ గాంధీ గారూ.. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఈ ప్రచార పర్యటనలు చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? తెలంగాణ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా?” అని రాహుల్ గాంధీని కేటీఆర్ నిలదీశారు.
Also Read
- AP Panchayat Elections: మా అమ్మను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేయండి.. రూ.కోటి ఇస్తా.. కుమారుడి సంచలన ప్రకటన
- Hyderabad: అక్రమ అండాల దందాలో కొత్త కోణం.. వెలుగులోకి షాకింగ్ వ్యవహారం..
- CM Revanth Reddy: వైద్యం కోసం ఏ పేద కుటుంబమూ అప్పులపాలు కాకూడదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
- Personal Loan Interest Rates: ఏ బ్యాంకులో పర్సనల్ లోన్ వడ్డీ తక్కువ? ఆ బ్యాంకుల మధ్య పోలిక ఇదే..!
తాజావార్తలు
-
KTR: తెలంగాణ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
-
AP Panchayat Elections: మా అమ్మను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేయండి.. రూ.కోటి ఇస్తా.. కుమారుడి సంచలన ప్రకటన
-
IND vs NZ 4th ODI: రోహిత్, ఇషాన్ తప్పిదాలు.. 5 నుంచి 125 రన్స్!
-
Hyderabad: అక్రమ అండాల దందాలో కొత్త కోణం.. వెలుగులోకి షాకింగ్ వ్యవహారం..
-
CM Revanth Reddy: వైద్యం కోసం ఏ పేద కుటుంబమూ అప్పులపాలు కాకూడదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!