NTV Telugu Site icon

KTR : రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు పాపన్న గౌడ్

Ktr

Ktr

రాజన్న సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ బైపాస్ రోడ్డులో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు పాపన్న గౌడ్ అని ఆయన కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్రం, తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది పాపన్ననే అని ఆయన వ్యాఖ్యానించారు. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో గౌడన్నల సంక్షేమం కొరకు ఆనాడు కేసీఆర్‌ ఎన్నో మంచి పనులు చేసాడని, గౌడన్నల కొరకు చెట్లపై పన్నులు తీసివేసి వారి కుల వృత్తిని కాపాడింది కేసీఆర్‌ ప్రభుత్వమన్నారు. గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించి వైన్ షాపులు కేటాయించామని, గత ప్రభుత్వం లో నీర ను ప్రోత్సహించి ట్యాంకు బండిపై నీరా కేఫ్ పెట్టీ నీర వల్ల ఉపయోగాలు ప్రజలకు చెప్పడం జరిగింది దానివల్ల ఉపాధి కూడా కల్గిందన్నారు. గత ప్రభుత్వంలో 1000 పైగా గురుకులాల ఏర్పాటుచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆరున్నర లక్షల మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించామని, సర్వాయి పాపన్న మహానీయుడి విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక జనగామ జిల్లాకు అతని పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Kolkata rape case: తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు!
ఆసక్తికర సన్నివేశం : అన్నా రామన్న.. ఆనాటి నవ్వులు ఏవన్నా …అంటూ పాటను పాడుతూ ఓ వ్యక్తి కేటీఆర్ ను తన పెన్షన్ గురించి అడిగాడు అందుకు బదులుగా సమాధానం చెప్పిన కేటీఆర్, వెళ్లి రేవంత్ రెడ్డిని అడుగు అంటూ నవ్వులు కురిపించాడు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సిరికల్లకు విచ్చేసిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్ లో గల సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలవేసి జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు. అక్కడే పక్కనే ఉన్న వ్యక్తి స్టేజి ఎక్కి పాపన్న విగ్రహానికి పూలమాలవేసి కిందికి దిగివస్తూ ఉండగా గమనించి కేటీఆర్ ను చూస్తూ అన్నా రామన్న ఆనాటి నవ్వులు ఏవన్నా అనుకుంటూ పాటను పాడి కేటీఆర్ మరిచిపోయిన నవ్వుని గుర్తు చేశాడు. అంతేకాకుండా తన పెన్షన్ గురించి విచారించగా వెళ్లి రేవంత్ రెడ్డిని అడుక్కో అని చమత్కారంగా బదులిచ్చారు కేటీఆర్.

Shabbir Ali : మా అక్క చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోం