Site icon NTV Telugu

KTR: అంత్యక్రియలకు రాలేకపోయా.. లాస్య కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్..

Ktr Lasya House

Ktr Lasya House

KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇవాళ ఉదయం కార్ఖానాలోని ఆమె నివాసానికి మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డితో కలిసి కేటీఆర్‌ వెళ్లి నందిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె తల్లి, సోదరిని ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్న వార్త విని షాక్‌కు గురయ్యానన్నారు. విదేశాల్లో ఉన్నందున ఆమె అంత్యక్రియలకు హాజరు కాలేకపోయానని చెప్పాడు. లాస్య నందితుని గత 10 రోజులుగా పలు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఆమె తండ్రి సాయన్న గతేడాది చనిపోయారని, ఇప్పడు ఆమె చనిపోవడం బాధాకరమని అన్నారు. లాస్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఆమె కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Read also: Air India Saftey Mudras: ఎయిర్ ఇండియా వినూత్న ఆలోచన.. నృత్య రూపంలో భద్రతా ప్రదర్శన

కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన తెలిసిందే. ఇప్పటికి ఆమె కారుకు ఎలా ఆక్సిడెంట్ అయ్యింది అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కాగా.. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు అచ్చంపేట నియోజకవర్గంలోని డీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో, మధ్యాహ్నం 2 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.
Hussain Sagar: సాగర్‌లోకి మురుగు నీరు.. జలావరణానికి ప్రమాదముంటున్న పీసీబీ నివేదిక

Exit mobile version