NTV Telugu Site icon

KTR : మరోసారి సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు

Ktr

Ktr

నిన్న తెలంగాణ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం పేరిట కల్లు గీత కార్మికులకు కిట్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం ల‌ష్క‌ర్‌గూడ‌లో కాట‌మ‌య్య ర‌క్ష‌ణ క‌వ‌చం కిట్ల పంపిణీ ప‌థ‌కాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గౌడ‌న్న‌ల ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తించాడు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. గంట‌ల త‌ర‌బ‌డి గౌడ‌న్న‌ల‌ను చెట్ల మీద ఉంచ‌డం స‌రికాద‌న్నారు.

Gauri Krishna: చంపేస్తామంటున్నారు.. పోలీసులకు పొలిమేర నిర్మాత ఫిర్యాదుAudi Q5 Bold Edition: మరో విలాసవంతమైన కారు విడుదల చేసిన ఆడి ..6.1 సెకన్లలో 100km/h వేగం..

“నిస్సందేహంగా అసహ్యంగా , అమానవీయంగా” అభివర్ణించాడు, కల్లు గీత కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాంగ్రెస్‌ నేతలు పిచ్చి జోకులు పేల్చుతున్నారని విమర్శించారు. ‘మానవత్వం ఉన్న నాయకుడెవరూ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడడు! గౌడన్నలను ఆ చెట్ల మీద అంతంతసేపు నిలబెట్టి, వారి వృత్తి మీద చౌకబారు జోకులు వేస్తూ, దాన్ని ప్రచారానికి వాడుకోవడం అమానవీయం, దుర్మార్గం! మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే.. ప్రచారం పీక్‌లో ఉంటుంది.. అని మీ మతిలేని చర్యలు చూసి.. తెలంగాణ ప్రజలకు అర్థమవుతోంది.’ అంటూ ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పోస్ట్ చేశారు.