NTV Telugu Site icon

KTR : రేవంత్ రెడ్డి ఒకప్పుడు నాకు మంచి స్నేహితుడు.. కానీ..!

Ktr In Assembly

Ktr In Assembly

తెలంగాణ అసెంబ్లీ సమవేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంగ్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడంపై అధికార పక్ష ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, 18 ఏళ్ల నుంచి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ.. గత పదేళ్లుగా మా మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయని, చిన్న వయసులోనే సీఎం అయ్యారు. ఆయన అదృష్టవంతుడు అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అయితే.. ఇదిలా ఉంటే.. గ‌త‌ పది సంవత్సరాల్లో ఏం మంచి జ‌రిగిందో చెబుదామంటే రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి కేసీఆర్ ఫోబియా ప‌ట్టుకుందని ఆయన సెటైర్‌ వేశారు.

AP Government: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం!

మాట్లాడితే కేసీఆర్ ఆన‌వాళ్ల‌ను చెరిపేస్తామ‌ని అంటున్నారని, చేరిపేయలేని, తుడిపేయలేని, దాచెయ్యలేని ఆనవాళ్లు కేసీఆర్ ఆనవాళ్లు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎలా చెరిపేస్తారు కేసీఆర్ ఆన‌వాళ్ల‌ను అని ప్ర‌శ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్.. కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్.. భగీరథ నల్ల నీళ్లలో కేసీఆర్.. పాలమూరు జలధారల్లో కేసీఆర్.. సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్.. గురుకుల బ‌డిలో కేసీఆర్.. యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్.. విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్.. మెడికల్ కాలేజీల వైద్య విద్య విప్లవంలో కేసీఆర్.. కలెక్టరేట్ భ‌వ‌నాల‌ కాంతుల్లో కేసీఆర్.. కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్‌లో కేసీఆర్.. మీరు కూర్చున్న సచివాలయపు సౌధ రాజసంలో కేసీఆర్.. టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్ సృజనలో కేసీఆర్.. వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్.. ప్ర‌పంచంలోని అతి పెద్ద అంబేద్క‌ర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్.. అమర దీపం ఆశయల్లో కేసీఆర్ ఉన్నారని అని కేటీఆర్ పేర్కొన్నారు.

Renu Desai: టచ్ కూడా చేయలేదు, చంపకుండా వదిలేస్తే పనిమనిషి పెంచింది.. రెండో పెళ్లిపై రేణు దేశాయ్ సంచలనం