NTV Telugu Site icon

Pocharam Srinivas Reddy : ప్రపంచంలో పేరుగాంచిన వ్యక్తి కేటీఆర్

speaker Pocharam Srinivas Reddy

speaker Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy : జిల్లెల్ల వ్యవసాయ కళాశాల(Jillella Agriculture College) దేశంలోనే అత్యుత్తమ కళాశాల అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) అన్నారు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla)లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో పేరుగాంచిన వ్యక్తి కేటిఆర్ అని కొనియాడారు.. తాము 47 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కంటే మిన్నగా కేటిఆర్(KTR) సిరిసిల్లను అభివృద్ధి చేశారన్నారు. ఉబికి వచ్చిన భూగర్భ జలాలలో రాజన్న సిరిసిల్ల రాష్ట్రంలోనే నెంబర్.1 గా నిలిచిందన్నారు. ఐఏఎస్(IAS) లకు పాఠంగా మారిందన్నారు. దీనికి కారణం సిఎం కేసీఆర్ అన్నారు పోచారం. ఇన్ని రిజర్వాయర్ లు వస్తాయని ఎవ్వరైనా ఊహించారా? అన్నారు. తెలంగాణ(Telangana)లో ఒక కోటి 8 లక్షల నుంచి 2 కోట్ల 30 లక్షల కు సాగు విస్తీర్ణం పెరిగింది అంటే కేసిఆర్ కృషేనన్నారు. కేసిఆర్ నాయకత్వంలో మంత్రి కేటీర్ ప్రత్యేక చొరవ తో 10 లక్షల మందికి ఐటీలో ఉపాధి లభించిందని స్పీకర్ పోచారం అన్నారు. 22 వేల పరిశ్రమలు కొత్తగా వచ్చాయని.. 19 లక్షల మందికి నాన్ ఐటీ రంగంలో ఉపాధి లభించిందన్నారు. తెలంగాణ పథకాలను మహారాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారని.. తెలంగాణలో ఉన్న పథకాలు మరే రాష్ట్రాలలో లేవన్నారు.

Read Also: Wealth of CMs: 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే.. ఆ ఒక్కరు ఎవరంటే..?

ఈ సందర్భంగా కాంగ్రెస్ – బీజేపీలపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. రెండు జాతీయ పార్టీలకు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)కి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇన్ని పథకాలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. అలా ఉన్నట్లైతే తాను శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటానంటూ సవాల్ చేశారు. TSPSCలో తప్పులు జరిగితే కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి? అని ఆయన ప్రశ్నించారు. ఏం జరిగినా..కేటీఆర్ (KTR), కేసీఆర్ (KCR) రాజీనామా చేయాలని అంటారా? అని మండిపడ్డారు.

Read Also: Jagananna Mana Bhavishyath: రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు.. అనూహ్య స్పందన..