KTR: తెలంగాణ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని తమవైపు నుంచి చాలానే ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రతిపక్ష నేతలు ఆ భయంతో పారిపోయారని విమర్శించారు. నాలుగు గోడల మధ్య కాదు, అసెంబ్లీలో చర్చ పెట్టు అంటే పారిపోయారని, లై డిటెక్టర్ పరీక్ష పెట్టమంటే మళ్లీ పారిపోయారు అంటూ ఘాటుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Read Also: Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్..!
తనపై అవినీతికి సంబంధించిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కాదు.. ఒక్క పైసా కూడా పోలేదు అని చెప్పాను.. అయినా సీఎం చెప్పిన ప్రశ్నలే తిప్పి తిప్పి అడుగుతున్నారు. ఆయనకు ఒక్కటే షో ఉంది అంటూ విమర్శల దాడి చేశారు. తాను ఈ నెల రోజులుగా విచారణలతోనే గడుపుతున్నానని, కానీ దీన్ని రాజకీయ కక్ష సాధింపు భాగంగా చూస్తున్నట్టు తెలిపారు. నేను నెల రోజులుగా ఉన్నాను. వేరే వాళ్లని కూడా జైలుకు పంపాలని చూస్తున్నారు. అధికారులకు నేను ఇదే చెప్పాను.. నన్ను కావాలంటే 15 రోజులు జైలులో పెట్టండి, రెస్ట్ తీసుకుని వస్తాను అని అన్నారు.
Read Also: Perni Nani: వైసీపీకి షాక్.. పేర్నినానికి అరెస్ట్ వారెంట్ జారీ
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను జైలు కూడా అనుభవించానని, ఇప్పుడు అవసరం వస్తే మళ్లీ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తెలంగాణ కోసం ఆ రోజున జైలు వెళ్లాను. ఇప్పుడూ అవసరమైతే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను అని వ్యాఖ్యానించారు. తనపై జరిగిన విచారణలపై.. ఇది డైలీ సీరియల్ లా మారిపోయింది. విచారణ అని పిలిచి, చాయ్ ఇచ్చి పంపడం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయిందని అన్నారు.
