BRS MLAs Arrested: తీవ్ర ఉద్రిక్తత.. హరీష్‌ రావు, కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..

Ktr Harish1

Ktr Harish1

KTR, Harish Rao Arrested: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ తో పాటు కొందరు ఎమ్మెల్యేలను బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలను జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా.. నిన్న (సోమవారం) అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. దీంతో దామరకుంట దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌పై బీఆర్ఎస్ నాయకులు రాళ్ల దాడికి యత్నించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్నాయి. దీంతో అసెంబ్లీ వద్ద నుంచి కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫామ్‌ హౌస్‌కు బయలుదేరారు. హకీంపేట వద్ద పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను కాలినడకన బయలుదేరారు. బొల్లారం వద్ద పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎర్రవల్లి వెళ్తున్న తమను ఆపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లారం చౌరస్తా నుంచి ఎరవెల్లి వైపు నడుచు కుంటూ వెళ్తుండగా.. పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.