KTR-Prabhas: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అంటే మనకు ఎప్పుడూ రాజకీయ సమీక్షలు, బిజీ షెడ్యూల్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, తాజాగా ఆయన ఎవరూ ఊహించని విధంగా సరికొత్త లుక్‌లో మెరిసి అందరినీ ఫిదా చేశారు. ‘ది అండర్ 18 వరల్డ్’ (The Under 18 World) అనే చిన్నారుల గ్రూప్‌తో కేటీఆర్ సరదాగా ముచ్చటించిన ఓ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ చిట్‌చాట్‌లో పిల్లలు అడిగిన కొన్ని గూగ్లీ లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేటీఆర్ సరదాగా తల పట్టుకోవడం చూస్తే ఎవరికైనా నవ్వు ఆగదు. అయితే, ఈ షోలోనే అసలైన ట్విస్ట్ ఇస్తూ.. టాక్ షో జరుగుతుండగానే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఆయన లైవ్‌లోనే ఫోన్ కాల్ చేశారు. కేటీఆర్ స్క్రీన్‌పై ప్రభాస్‌తో మాట్లాడటం చూసి అక్కడ ఉన్న పిల్లలతో పాటు సోషల్ మీడియా ఆడియన్స్ సైతం షాక్‌తో కూడిన ఆనందంలో మునిగిపోయారు.
రాజకీయాల్లో ఎంత గంభీరంగా ఉంటారో, ఇలాంటి వేదికలపై కేటీఆర్ అంతే హుషారుగా ఉంటారని ఈ ప్రోమో నిరూపించింది. షోలో పాల్గొన్న ఒక చిన్నారి ఛాలెంజ్ విసరడమే ఆలస్యం.. కేటీఆర్ ఏమాత్రం తగ్గకుండా స్టేజ్ పైనే ఆమెతో పోటీ పడి మరీ పుష్-అప్స్ తీసి తన ఫిట్‌నెస్‌తో ఆశ్చర్యపరిచారు. సరిగ్గా ఇంటర్వ్యూ రసవత్తరంగా సాగుతున్న సమయంలోనే ఆయన సతీమణి కల్వకుంట్ల శైలిమ నుంచి ఫోన్ రావడం, దాంతో కేటీఆర్ ఒక్కసారిగా కంగారు పడుతూ.. “షోలో ఉన్నాను, తర్వాత చేస్తా” అంటూ స్పీడ్‌గా ఫోన్ కట్ చేయడం ఈ ప్రోమోకే అసలైన హైలైట్‌గా నిలిచింది. ఎంతటి లీడరైనా భార్య ఫోన్ వస్తే ఆ ఆందోళన కామనే కదా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. లీడర్‌లోని సరికొత్త ఎంటర్‌టైనింగ్ కోణాన్ని చూపించిన ఈ ఫుల్ ఇంటర్వ్యూ వీడియో త్వరలోనే రిలీజ్ కానుండటంతో అటు పొలిటికల్ సర్కిల్స్‌లో, ఇటు పబ్లిక్‌లో ఇప్పుడు దీని గురించే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
unexpected Crossover of the Day!
KTR Anna x Prabhas Anna Combo! 🔥💥
KTR Anna ప్రభాస్ అన్న కి కాల్ చేయడం…
ఆ బ్యాక్‌గ్రౌండ్ లో బాహుబలి BGM రావడం… Next Level 🥵😍Waiting for the full episode! 💥#KTR #Prabhas #Under18 pic.twitter.com/WYbctrxQPP
— Praveen Reddy (@Praveen_Prabha_) June 30, 2026

