NTV Telugu Site icon

KTR : రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి

Ktr

Ktr

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లి లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మహోబాద్ కి దుకాన్ అంటారు ఇదేనా తెలంగాణ లో ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తున్నారని, 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి హత్యలు ఎప్పుడు జరగలేదు మేము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండేదా అని ఆయన అన్నారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని కల్లోళ్ల ప్రాంతంగా సమస్యత్మక ప్రాంతంగా ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరుకేమో ప్రజాపాలన చేస్తున్నదేమో ప్రతికరణ పాలన అని ఆయన మండిపడ్డారు. రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు కేటీఆర్‌. మధ్య జూపల్లి కృష్ణారావు సహకారం లేకుండా ఈ హత్యలు జరగవని కేటీఆర్‌ మండిపడ్డారు. కొల్లాపూర్ లో ఫ్యాక్షన్ సంస్కృతి నెలకొంది.కొల్లాపూర్ లో జరుగుతున్న వరుస హత్యల మీద జ్యుడీషియల్ విచారణ జరపాలని, శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నారు కేటీఆర్‌. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో మంత్రి జూపల్లి.కృష్ణారావు ను బర్తరపు చేయాలని, తెలంగాణలో ఎక్కడలేని ఫ్యాక్షని సంస్కృతి కొల్లాపూర్ లో నెలకొందన్నారు కేటీఆర్‌.

 

శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌కు గురైన‌ట్టు ఉద‌యం 5.30కు పోలీసుల‌కు ఫోన్ చేస్తే గంట‌న్న‌ర త‌ర్వాత వ‌చ్చి ప్రేక్ష‌క‌పాత్ర పోషించారు. ఈ కేసులో ముందుగా ఎస్ఐని స‌స్పెండ్ చేయాలి. మా కార్య‌క‌ర్త‌లు కూడా ర‌గిలిపోతున్నారు. ఇదే దాడుల సంస్కృతి కొన‌సాగితే మేం కూడా నియంత్రించ‌లేం. ఈ సంస్కృతి రాష్ట్రానికి మంచిది కాదు. ఇలాగే హ‌త్య రాజ‌కీయాలు కొన‌సాగితే మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టిడికి కూడా వెనుకాడం. శ్రీధ‌ర్ రెడ్డి తండ్రిని స‌ముదాయించ‌లేక‌పోతున్నాం. శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య వెనుకాల జూప‌ల్లి కృస్ణారావు ఉన్నాడ‌ని కేసు పెడితే, మంత్రి పేరు ఉప‌సంహ‌రించుకోవాల‌ని పోలీసులు ఒత్తిడి తెస్తున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. హ‌త్య‌లు, దాడులు, కేసులు, సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరింపులు, బైండోవ‌ర్లు ఇదేనా నీ చిల్ల‌ర రాజ‌కీయం అని కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వాన్ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఈ సంస్కృతి కొన‌సాగితే తెలంగాణ‌కు మంచిదికాదు. ఈ హ‌త్య రాజ‌కీయాల‌కు తెర దించాలి. శ్రీధ‌ర్ రెడ్డి కుటుంబానికి అండ‌గా ఉంటాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.