తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పోరేటర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన, 420 హామీలకు అమలుకు 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించిందని తెలిపారు.
Jani Master: పవన్ కళ్యాణ్ జోలికి వస్తే పీర్ల పండుగే.. జానీ మాస్టర్ ఫైర్
మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా సోదరీమణులకు ఇవ్వాల్సిన మొత్తమే 50వేల కోట్ల పైన అవుతుంది.. మరి రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలుకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో బడ్జెట్ లో చెప్పలేదు అని ప్రశ్నించారు. ఫార్మసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వలన రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతినే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి దెబ్బతింటే, రాష్ట్రానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.. జీహెచ్ఎంసీ పాలకవర్గం బాధ్యతలను నిర్వహించడంలో ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. ప్రజాపాలన అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ.. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం జరగకుండ, స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు కాకుండా ఆపుతుందని పేర్కొన్నారు.
PM Modi: అబుదాబిలో మోడీ టూర్.. హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని
ఈనెల 13 న నల్లగొండలో జరిగే సభకు అందరూ హాజరు కావాలని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలను కోరామని తెలిపారు. మరోవైపు.. ఈనెల 19న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరవుతారని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న నిర్ణయాలను.. తమ సభ్యులు ఎండగడతారని పేర్కొన్నారు. ఒక్కరో ఇద్దరో పార్టీ మారితే వచ్చే నష్టం ఏమి లేదు.. అది వారి కర్మ అని కేటీఆర్ తెలిపారు.