Site icon NTV Telugu

KTR: బడ్జెట్ మొత్తం నిరాశగా ఉంది.. ప్రభుత్వంపై విమర్శలు

Ktr

Ktr

సికింద్రాబాద్లో జరిగిన సనత్ నగర్ నియోజకవర్గ విజయోత్సవ సభకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి. పద్మరావు గౌడ్, మాగంటి గోపీనాథ్, పాడిడి కౌశిక్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడారు. బడ్జెట్ మొత్తం నిరాశగా ఉందని విమర్శించారు. 6 పథకాల అమలుకు లక్షా 25 వేల కోట్లు అవసరమవుతుందని.. బడ్జెట్ లో మాత్రం కేవలం రూ.53వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.

Read Also: PM Modi: బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది

కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలను కేంద్రంలో అధికారంలోకి వస్తేనే అమలు చేస్తారనడాం విడ్డూరంగా ఉందని కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రతి మీటరుకు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాల్సిందే.. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు.. తెలంగాణ జల హక్కులను కృష్ణాబోర్డుకు కేటాయించడం నిరసిస్తూ 13న నల్లగొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also: Tragedy: తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థి ఆత్మహత్య..

Exit mobile version