రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్, తుల ఉమా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. మీటింగ్ ఆలస్యం అయినా, మనం ఓడిపోయిన గుండె, ధైర్యంతో ఓపిక తో కూర్చున్న మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానన్నారు. రైతులు అంటున్నారు, కేసీఆర్‌ను ఓడగొట్టుకొని తప్పు చేశాం అర్థ రాత్రి కరెంట్ మోటార్లు వేసుకొనే పరిస్థితి వచ్చిందన్నారు కేటీఆర్. డిసెంబర్ 3న కేసీఆర్ ముఖ్య మంత్రి అయితే భారత దేశంలోని ఉన్న 5 వేల టిప్పర్లు, 3 వేల హిట్టాచి ప్రాక్లెన్ లు తెప్పించి కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేపిస్తుండే అని ఆయన అన్నారు. మొన్ననే మనకు అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు, మళ్ళీ మనకు అవకాశం వచ్చింది ప్రజల మన్నలను పొంది వినోద్ కుమార్ ను గెలిపించుకుందామన్నారు. ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి, వచ్చే నెలలో వడ్లు వస్తాయి అవి కొని ఇస్తానన్న బోనస్ రైతులకు ఇవ్వాలని, ఎండాకాలం లో పంటలకు, మంచి నీళ్లకు, పశువులకు నీళ్ల గోస వచ్చేలా ఉంది, కెసిఆర్ కోపం మీద కాళేశ్వరం రిపేర్ చేపించి నెల రెండు నెలల్లో నీళ్లు ఇవ్వాలన్నారు.
Ambati Rambabu: పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి సెటైర్లు..
అంతేకాకుండా.. ‘వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే బొంద పెడుదాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చాటుదాం. బండి సంజయ్ మండలం ఒక్క మీటింగ్ కైన హాజరు అయ్యారా…? ఎందుకు ఓట్లు వేయాలి. బండి సంజయ్ ఫేమస్ డైలాగ్ విన్న ఒక్కటే ఇవ్వాళ ఎం వారం అన్న అని. దేశం కోసం ధర్మం కోసం ఉండే బండి కావాలా…? కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి కోసం పోరాడే వినోద్ కుమార్ కావాలా… ఎల్లారెడ్డి పేటలో బండి సంజయ్ ఒక్క హైమస్ట్ లైట్ పెట్టిండు, మన దగ్గరా సర్పంచులు హైమాస్ట్ లైట్ లు గ్రామానికి ఒక్కొక్కటి పెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయ్యాకా ప్రతి గ్రామానికి వచ్చి మీతో ఉంటాను. నాకు కూడా జ్ఞానోదయం అయ్యింది. నన్ను కడుపులో పెట్టుకొని ఐదు సార్లు గెలిపించారు. ఇక నుండి వచ్చే ఎన్నికల్లో కాలుకు గజ్జె కట్టుకొని మి గెలుపుకోసం ముందు ఉంటా.’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
