Site icon NTV Telugu

KTR : కాంగ్రెస్‌, బీజేపీలపై కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

Brs Ktr

Brs Ktr

కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన “నోట్లతో నిండిన టెంపో” వ్యాఖ్యలకు ధీటుగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గురువారం మాట్లాడుతూ.. డీ-మానిటైజేషన్‌ విఫల ప్రయత్నమని ప్రధాని మోదీ భావిస్తున్నారా? అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్​కు అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బు పంపుతున్నారని ప్రధాని మోదీ అన్నారని, ఆయన మాట ప్రకారం కాంగ్రెస్‌కి వాళ్లు అంతగా డబ్బు పంపుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను స్కాంగ్రెస్‌గా అభివర్ణించారు. మోదీకి ఇష్టమైన ఈడీ, సీబీఐలు స్కాంగ్రెస్‌ విషయంలో ఎందుకు మిన్నకుండి పోయాయని కేటీఆర్​ సూటిగా ప్రశ్నించారు.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ట్వీట్‌లో, ఇన్వర్టర్లు, ఛార్జింగ్ బల్బులు, టార్చ్‌లైట్లు, కొవ్వొత్తులు, జనరేటర్‌లతో మరియు పవర్ బ్యాంకులు సహా “ఆరు హామీలు” అని వ్యంగ్యంగా ట్యాగ్ చేయబడిన ఉత్పత్తుల జాబితాను “స్టాక్ అప్” చేయమని కేటీఆర్‌ పౌరులకు పిలుపునిచ్చారు. “గుర్తుంచుకోండి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, BRS కాదు,” అని ఆయన పౌరులకు గుర్తు చేశారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ అంతరాయాలను సూచించాడు. మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తెలివిగా ఓట్లు వేయాలని ఆయన కోరారు.

Exit mobile version