Site icon NTV Telugu

KTR : రేవంత్ రెడ్డి సిద్ధమా..? కేటీఆర్ సవాల్..

Ktr

Ktr

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏసీబీ అధికారులు తనకు జారీ చేసిన నోటీసులపై స్పందించిన ఆయన, సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, పాలన చేయడం చేతకాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఒక్కో రోజు ఒక్కో డ్రామా వేస్తున్నాడు. ఈ చిల్లర కుట్రలతో మమ్మల్ని ఆపలేరు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం,” అని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు ద్వారా పంపిన రూ.44 కోట్లు ఇప్పటికీ సంబంధిత సంస్థ అకౌంట్‌లోనే ఉన్నాయని, అయినప్పటికీ వాటిని వెనక్కి రప్పించలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరలా ఏసీబీ నోటీసులు పంపిందని ఎద్దేవా చేశారు.

Supreme Court : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..

తాను చట్టాలను గౌరవించే పౌరుడిగా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవుతానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. అయితే అదే ఏసీబీ పరిధిలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ‘నోటుకు ఓటు’ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డినని గుర్తు చేశారు. “ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులు ఉన్న నేపథ్యంలో.. ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు అన్నది తేల్చేందుకు జడ్జి సమక్షంలో, లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం. నేనైతే సిద్ధం – రేవంత్ రెడ్డి సిద్ధమా?” అంటూ సవాల్ విసిరారు.

Supreme Court : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..

Exit mobile version