NTV Telugu Site icon

KTR: కులగణన తప్పుల తడక.. వెంటనే రీ సర్వే చేయండి

Ktr

Ktr

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన నయవంచనను అసెంబ్లీలో, మండలిలో ఎండగట్టామని అన్నారు. తప్పుల తడకగా ఉన్న కులగణనను మళ్లీ నిర్వహించాలని కోరామని తెలిపారు. బీసీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతంలో కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు.. కానీ కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని అన్నారు. 15 లక్షల మంది బీసీలను తక్కువ చేసి చూపించారని అన్నారు. మరో 15 రోజుల్లో బీసీ కులగణన చేయండి.. తాము సర్వేలో పాల్గొనలేదు అని అసెంబ్లీలో అన్నారు.. ఈసారి తాము కూడా సర్వేలో పాల్గొంటామని కేటీఆర్ తెలిపారు.

Read Also: Vijay : విజయ్ దేవరకొండ సినిమాలో బాలీవుడ్ యాక్టర్

కులగణన సర్వే వెంటనే రీ సర్వే చేయండని కేటీఆర్ కోరారు. రేపటి నుంచి మండలాల, జిల్లాల వారీగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఈ మీటింగ్ లో చాలా మాట్లాడుకున్నామని అన్నారు. తమ అధినేత కేసీఆర్‌తో మాట్లాడి తమ కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు. నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ చాయ్ తాగే లోపు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై ఫైనల్ చేయొచ్చునని పేర్కొన్నారు. కానీ కావాలని బీసీ రిజర్వేషన్లు చేయట్లేదని కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు.. బీసీ లెక్క సమగ్రంగా తెలిసింది అంటే.. బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేతోనేనని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 28 లక్షల బీసీలు తగ్గారు.. అంటే ఆ లెక్క బీఆర్ఎస్ లెక్కలు ఉన్నవి కాబట్టే తెలిశాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సమగ్ర కుటుంబ సర్వే చేయలేదని మాట్లాడారు.. సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు చేశామో అందరికి ఇప్ప్పుడు తెలుస్తుందన్నారు.

Read Also: Ponguru Narayana : పేదలకు శుభవార్త.. 2 లక్షల 30 వేల ఇళ్లను పూర్తి చేసి ఇస్తామన్న మంత్రి..

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 34 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పి 19 సీట్లు ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన సర్వేని చెత్త బుట్టలో వేయాలని దుయ్యబట్టారు. కేసీఆర్ తలసాని శ్రీనివాస్ కు ఫోన్ చేసి బీఆర్ఎస్‌లో చేసిన సర్వేకి లెక్క ఎలా తగ్గుతుందని అసెంబ్లీలో ప్రశ్నించమని చెప్పారన్నారు. త్వరలో బీసీ సభ నిర్వహిస్తామని.. ముఖ్య అతిధిగా పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు కామారెడ్డి డిక్లరేషన్ సభ పెట్టిన చోటనే బీసీ సభ నిర్వహిస్తామని చెప్పారు. నియోజకవర్గల్లో, మండలాల్లో కాంగ్రెస్ బీసీలని మోసం చేసిందని కార్యక్రమాలు చేపడతామని కేటీఆర్ అన్నారు.