KTR : రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ధర్నాకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ధర్నా ప్రతిపాదిత స్థలం హైవే వెంట ఉండటం, జిల్లాలో గ్రామసభలు జరుగుతుండడం, సంక్రాంతి హడావిడి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఇవ్వలేమని బీఆర్ఎస్ పార్టీకి తేల్చి చెప్పారు పోలీసులు. రేపటి మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేదూకు సిద్ధమవుతుంది.. కేటీఆర్ పాల్గొనే రైతు ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పు పట్టింది.
Israel – Hamas: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న ఖైదీల విడుదల..