KTR : ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం నందినగర్‌లోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్, ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే అధికారులు అతనిపై విచారణ ప్రారంభించారు.
ఈ విచారణలో ముగ్గురు ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను కీలకమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ తరఫు న్యాయవాది రామచంద్రరావు కూడా హాజరయ్యారు. విచారణ సందర్భంగా పలు అంశాలను చర్చకు తెచ్చిన ఏసీబీ, కేసు సంబంధిత ప్రధాన విషయాలను కేటీఆర్ ముందుంచినట్లు సమాచారం.
- ఫార్ములా ఈ కార్ రేసు ఎందుకు తీసుకురావాలనుకున్నారు..?
- ఎవరి నిర్ణయం వల్ల నగదు బదిలీ చేశారు.?
- HMDA నిధులు ఎలా బదిలీ చేశారు. ?
- కేబినెట్ అనుమతి ఉందా.?
- అగ్రిమెంట్లు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎలా చేశారు.?
- ఎవరికి ప్రయోజనం జరిగింది.?
- కేటీఆర్ ఆదేశంతోనే నగదు రిలీజ్ చేశామని అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్. దీనిపై మీ సమాధానం ఏంటి.?
- హెచ్‌ఎండీఏ నుంచి ఈ కార్ రేసింగ్‌కు రూ.55 కోట్లు ట్రాన్స్‌ఫర్ ఎలా జరిగింది.?
- నగదు బదిలీ చేయాలని ఎవరిని ఆదేశించారు. పౌండ్ల రూపంలోకి మార్చి సొమ్ము బదిలీ చేశారా.?
- దీనికి ఆదాయపన్ను మినహాయింపు ఉందా.?
- ఐటీకి HMDA రూ.8.6 కోట్లు ఎందుకు పే చేయాల్సి వచ్చింది.?
- కార్ రేస్ కోసం మీరు ఎవరెవరిని కాంటాక్ట్ చేశారు.?
- రాష్ట్రం నుంచి మీతో కాంటాక్ట్‌లో ఉన్న అధికారులు ఎవరు.?
- కేంద్రం నుంచి సహకారం అందించిన వాళ్లు ఎవరు.?
- ఫార్ములా ఈ కార్ రేస్ అధికారులను మీరు ఎప్పుడు కలిశారు.?
- 10 సీజన్స్‌ను నిర్వహించాలని వాళ్లు షరతులు విధించారా.?
- ప్రతి సీజన్‌కి కొంత డబ్బుని వాళ్లకు చెల్లించవలసి ఉంటుందా..?
- వాళ్లకు ఎన్ని డబ్బులు చెల్లించవలసి ఉంటుంది..?
- ఏదైనా వివాదాలు వస్తే పరిష్కారం కోసం ఆర్బిట్రేషన్ పెట్టుకున్నారా.?
- మొదటి ఫార్ములా ఈ రేసు కోసం ఎంతమంది పార్ట్నర్స్..?
- ట్రైపాడ్ అగ్రిమెంట్‌లో ఉన్న నిబంధనలు ఏంటి..?
- మొదటి రేసింగ్‌లో ఏస్ నెక్ట్స్ కంపెనీ ఎంత పెట్టుబడులు పెట్టింది..?
- జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ శాఖల సహకారం ఎంతవరకు ఉంది.?
- ఆర్థికంగా ఫార్ములా రేస్ కోసం ఏమైనా ఖర్చు పెట్టాయా.?
- ఫార్ములా సెకండ్ సీజన్ నుంచి ఏఎస్ నెక్ట్స్ ఎందుకు తప్పుకుంది..?
- ఏఎస్ నెక్ట్స్ ఎంతవరకు పెట్టుబడులు పెట్టింది.? ఏ మేరకు లాభాలు ఆశించింది..?
- తర్వాత ఎవరైనా కంపెనీలతో మీరు అధికారులు సంప్రదింపులు చేశారా.?
- హెచ్‌ఎంటిని పార్ట్నర్‌షిప్‌గా చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు..?
- ఫార్ములా రేసు రద్దు కాకుండా డబ్బులు చెల్లించాలని ఎవరి నిర్ణయం..?
- కేబినెట్ అమనుతి తీసుకోవాలని అధికారులు మీకు చెప్పలేదా..?
- రూ.55 కోట్ల డబ్బుని హెచ్‌ఎంటితో ఎలా పెట్టుబడులు పెట్టించారు.?
- అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిల పాత్ర ఏమిటీ..?