పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ పక్కన నటించి మెప్పించిన కృతి సనన్.. తాజాగా ప్రొడ్యూసర్ అవతారమెత్తింది. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రొడ్యూసర్ బాధ్యతలు తీసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈవిడ కొద్దిరోజుల క్రితం మొదలు పెట్టిన ‘బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్’ అనే ప్రొడక్షన్ వెంచర్ నుండి ‘దో పత్తీ’ అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సినిమాకు తాను నిర్మాతగా పడిన కష్టం మొత్తాన్ని చెప్పుకొచ్చింది. మొదటిసారి సినిమా నిర్మాత కావడం వల్ల రోజుకు 16 నుంచి 17 గంటలు పనిచేయాల్సి వచ్చిందంటూ తెలిపింది.
Also Read: Telegram: వారి కోసం మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తెచ్చిన టెలిగ్రామ్..!
ఈ సినిమాలో తాను “ప్రతి సీన్ ను అదే రోజు పూర్తి చేయాలనుకున్నని.. అందుకోసం ఒక్కో రోజు ఏకంగా తాను., తనతోపాటు కొంతంది 16 – 17 గంటలు కష్టపడే వాళ్లమని తెలిపారు. ఇక మొదట తాను ప్రొడ్యూసర్ అవ్వాలని చెప్పినప్పుడు., అందరూ ఈ రోజుల్లో సినిమా బడ్జెట్ పెరిగిపోయిందని., ఇది వద్దు అనే సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరికీ సినిమా కోసం ఇచ్చే రెమ్యూనరేషన్లు, ప్రతిరోజు అయ్యే ఖర్చు లాంటివి మొత్తం దగ్గరుండి చూశాకకానీ, పరిస్థితి అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. ఇకపై తాను రాబోయ్యే సినిమాల్లో కేవలం ప్రొడ్యూసర్స్ హీరోయిన్ గా పనిచేయాలుకుంటున్నని తెలిపింది.
Also Read: Viral Video: ఈగకు ట్రైనింగ్ ఇచ్చిన ఘనుడు.. వీడుడెవడో రాజమోళిని మించేసాడుగా..!
ఇక ‘దో పత్తి’ సినిమాను శశాంకా చతుర్వేది తెరకెక్కిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ కథా నేపథ్యం సాగేలా ఈ చిత్రం తెరకెక్కిందని సమాచారం. ఇది ఇలా ఉండగా కృతి సనన్ తన తర్వాతి ప్రాజెక్టులో భాగంగా రాజేశ్ కృష్ణణ్ తెరకెక్కించిన ‘క్రూ’ చిత్రంలో కనపడుతుంది.
