Site icon NTV Telugu

Krithi Shetty: కృతి శెట్టి కెరీర్‌కు.. దెబ్బ మీద దెబ్బ

Krithi Shetty, Annagaaru Vastaaru,love Insurance Company

Krithi Shetty, Annagaaru Vastaaru,love Insurance Company

‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కృతి శెట్టి, ఆ తర్వాత వరుస చిత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, దురదృష్టవశాత్తూ అందులోనే వరుసగా వచ్చిన ఫ్లాపులు ఆమె కెరీర్ గ్రాఫ్‌ను దెబ్బతీశాయి. తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు తగ్గడంతో, ఈ బ్యూటీ తమిళ సినిమాల వైపు దృష్టి సారించింది. కానీ, అక్కడ కూడా ఆమెకు ఇంకా సాలిడ్ బ్లాక్‌బస్టర్ దక్కలేదు. ముఖ్యంగా హీరో కార్తీతో కలిసి నటించిన ‘అన్నగారు వస్తారు’ చిత్రంపై కృతి శెట్టి బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.

Also Read : Venkatesh Birthday : వెంకీమామ పుట్టినరోజున అనిల్ రావిపూడి సర్‌ప్రైజ్ వీడియో

అయితే, ఆమె ఆశించినట్టుగా ఏమి జరగడం లేదు. ఎందుకంటే ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. అంతేకాకుండా, కేవలం ఆరు రోజుల గ్యాప్‌లో అంటే డిసెంబర్ 18న విడుదల కావాల్సిన ఆమె మరో చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కూడా బడ్జెట్ సమస్యల కారణంగా వాయిదా పడుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీంతో, వారం తిరగకుండా రిలీజ్ కావాల్సిన కృతి శెట్టి రెండు ముఖ్యమైన సినిమాలు ఒకేసారి నిలిచిపోయాయి. ఈ వాయిదాల విషయంలో కృతి శెట్టి చేయగలిగింది ఏమీ లేకపోయినా, ఈ ప్రభావం మాత్రం ఆమె కెరీర్‌పై పడుతోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూసిన ఈ ఉప్పెన బ్యూటీ, ఇప్పుడు వరుస వాయిదాలతో తీవ్ర అయోమయంలో పడింది.

Exit mobile version