Krishnam Raju : మొగల్తూరులో కృష్ణంరాజు జయంతి వేడుకలు.. ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సీనియర్ హీరో రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఆయన స్వస్థలం మొగల్తూరులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వేణు కవర్తపు సారథ్యంలో, కృష్ణం రాజు గారి సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి వెయ్యి మందికి పైగా పేషెంట్స్ హాజరయ్యారు. మనదేశంతో పాటు యూకే, యూఏఈ దేశాలకు చెందిన సుమారు 40 మంది నిష్ణాతులైన వైద్యులు ఈ శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు అందించారు.
ఈ వైద్య శిభిరంలో డయాబెటిక్ ఫుట్ ఉచిత స్క్రీనింగ్, మందులు, కౌన్సెలింగ్ అందించారు. ఇండియా వైద్య బృందానికి హైదరాబాద్ జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ శేషబత్తారు సారథ్యం వహించారు.భీమవరంలోని డా.వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వైద్యులు డా.వర్మ, ఇంపీరియల్ హాస్పిటల్ వైద్యులు డా. నరేష్ ఈ వైద్య శిబిరంలో తమ సేవలు అందించారు. ఈ వైద్య శిబిరానికి వచ్చిన రోగులను అడాప్ట్ చేసుకుని వాళ్లకు భవిష్యత్ లోనూ కావాల్సిన వైద్య సహాయం అందిస్తామని డాక్టర్స్ తెలిపారు.
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
ఈ వైద్య శిబిరం విజయవంతం కావడంపై శ్యామలాదేవి గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ – కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం కావడం ఆనందంగా ఉంది. డయాబెటిక్ పుట్ సమస్యలతో వచ్చిన ఎంతోమంది పేషెంట్స్ మా క్యాంప్ లో వైద్య సహాయం పొందడం ఎంతో సంతృప్తిని కలిగించింది. ఇలాంటి హెల్త్ క్యాంప్స్ నిర్వహించి, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనేది కృష్ణంరాజు గారి కల. ఆయన ఆశయాల్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. అని చెప్పారు.
అనంతరం.. కృష్ణంరాజు గారి కూతురు ప్రసీద గారు మాట్లాడుతూ – నాన్నగారి కోరిక మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు అమ్మ శ్యామలాదేవి ఎంతో పట్టుదలగా కృషి చేసింది. పేద ప్రజలు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలనేది అమ్మ సంకల్పం కూడా. ఈ వైద్య శిబిరంలో అమ్మ తన పేరును మొదటగా రిజిస్టర్ చేసుకుంది. భవిష్యత్ లోనూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహిస్తామని చెప్పారు…
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!