Tulsi Remedies On Krishna Janmashtami: ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ‘శ్రీ కృష్ణ జన్మాష్టమి’ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఈ పండుగను జరుపుకోనున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం.. బుధవారం (సెప్టెంబర్ 6) ఉదయం 7:57 గంటలకు అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:39 గంటలకు రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. అందుకే బుధవారం జన్మాష్టమి వేడుకలను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే వైష్ణవులు మాత్రం సెప్టెంబర్ 7వ తేదీన జన్మాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు.
హిందూ మత విశ్వాసాల ప్రకారం.. తులసి మొక్క శ్రీ కృష్ణ భగవానుడికి చాలా ప్రియమైనది. తులసిని శ్రీకృష్ణుడి రూపంలో వివాహం చేసుకున్నారని నమ్ముతారు. అందుకే తులసి మొక్క ఉన్న ఇంట్లో కృష్ణ భగవానుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని విశ్వసిస్తారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున చేసే కొన్ని చర్యలు చాలా పవిత్రమైనవి, ఫలవంతమైనవి అని నమ్ముతారు. ఈ నేపథ్యంలో జన్మాష్టమి రోజున పాటించదగిన తులసి నివారణలు ఏవో ఇప్పుడు చూద్దాం.
సమస్యల నుంచి ఉపశమనం:
ఒక వ్యక్తి శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున తులసి పరిహారాలు చేస్తే.. అతని జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయి. ఈ రోజున తులసి మొక్క ముందు నిలబడి.. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రంతో పాటు గోపాల్, గోవింద్, దేవకీనందన్ మరియు దామోదర్ వంటి శ్రీ కృష్ణ భగవానుని పేర్లను జపించండి. ఇలా చేయడం వలన త్వరలోనే మీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సంతోషంగా వైవాహిక జీవితం:
జన్మాష్టమి నాడు ఇంట్లో తులసి మొక్కను నాటితే దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. అంతేకాదు ఇప్పటివరకు వివాహానికి అడ్డంకులు ఉన్నవారికి కూడా ఈ పరిహారం ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: World Cup 2023: అమితాబ్ బచ్చన్‌కు ‘గోల్డెన్ టికెట్’.. అన్ని మ్యాచ్‌లు ఫ్రీ!
ఆర్థిక పరిస్థితి మెరుగు:
జన్మాష్టమి రోజున శ్రీ కృష్ణుడికి నైవేద్యంలో తులసి ఆకును ఉంచినట్లయితే.. ఆ ప్రసాదం సంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల శ్రీ కృష్ణుడు మరియు లక్ష్మిదేవి ఆశీస్సులు ఉంటాయి. దాంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కోరిక నెరవేరుతుంది:
వ్యాపారంలో పురోగతిని కోరుకునే వారు జన్మాష్టమి రోజున తులసికి ఎరుపు రంగు చునరీని సమర్పించాలి. ఇలా చేయడం వలన వ్యాపారంలో విజయం మీ సొంతం అవుతుంది. అంతేకాకుండా వ్యక్తిగత కోరికలను కూడా నెరవేరుతాయి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)