Koti deepotstavam 6th Day : కమనీయం..రమణీయం తిరుమల శ్రీనివాస కల్యాణం, కొల్హాపూర్ మహాలక్ష్మీ అనుగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భక్తి టీవీ కోటిదీపోత్సవం వైభవంగా సాగుతోంది. ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం ఆరవ రోజు ఘనంగా ముగిసింది. నవంబర్ 14న ప్రారంభమైన కోటి దీపోత్సవ మహోత్సవం మహోద్యమంగా కొనసాగుతోంది. ఆ కైలాసమే ఇలకి దిగివచ్చిందా అనేలా.. కోటిదీపోత్సవ వేదికను ముస్తాబు చేశారు. ఒక్కసారైనా కోటిదీపోత్సవానికి వెళ్లాలి అనేలా భక్తులలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇల కైలాసంగా మారిపోయిన ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో మార్మోగుతోంది. ఆరవ రోజు కోటి దీపోత్సవం వేదికైన ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగాయి. ముందుగా శ్రీ సిద్దేశ్వరీ పీఠం, కుర్తాళంకు చెందిన శ్రీసిద్దేశ్వరానంద భారతి స్వామీజీ వారితో అనుగ్రహ భాషణం. ఉత్సవంలో భాగంగా బెంగళూరు కైలాసాశ్రమ పీఠాధిపతి శ్రీ జయేంద్రపురి మహాస్వామిజీ గారిచే అనుగ్రహభాషణం. తిరుపతి శక్తిపీఠం మాతా రమ్యానందభారతి గారిచే ఆశీర్వచనం. అనంతరం భక్తులచే గోవిందనామస్మరణ పూజ నిర్వహించారు. ప్రాంగణంలోకి కంచి కామాక్షి అమ్మవారికి & కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి ఆహ్వానం. ఆ తర్వాత కన్నుల పండుగగా తిరుమల శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వెనువెంటనే పల్లికి వాహనంపై అమ్మవార్లతో కలిసి శ్రీనివాసులు భక్తులకు దర్శనమిచ్చారు. కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు.. స్వర్ణలింగోద్భవ వైభవాన్ని భక్తులు తిలకించి తరించిపోయారు. మహాదేవునికి మహానీరాజనంతో పాటు అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలతో ఆరవ రోజు కోటి దీపోత్సవ వేడుక విజయవంతంగా ముగిసింది. ఆరవ రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. కోటిదీపోత్సవ వేదిక జనసంద్రంగా మారిపోయింది. అంతేకాకుండా.. దీపాలను వెలిగించి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. పిల్లా, పెద్ద అని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ మహాదేవుని ఆశీస్సులు పొందారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 9.30 వరకు ఎన్టీఆర్ స్టేడియం దీపాల కాంతులతో వెలిగిపోయింది. చూడటానికి ఎంతో అందంగా అద్భుతంగా అనిపించింది. మరోవైపు భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్ పక్షాన పూర్తి ఉచితంగా అందించింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తి టీవీ ఈ దీప మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ వస్తుంది.. ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటిదీపోత్సవం జరగనుంది.. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ మహాశివుడి అనుగ్రహం పొందాలని భక్తి టీవీ ఆహ్వానం పలుకుతోంది. కార్తిక మాసం, నాగుల చవిత వేళ.. కోటిదీపోత్సవంలో పాల్గొనండి.. ఆ మహాదేవుడి కృపకు పాత్రులుకండి..
Also Read
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!