Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
- వైభవంగా కోటి దీపోత్సవం తొమ్మిదో రోజు
- కంచి విజయేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం
- కంచి కామాక్షి మహాభిషేకం, కుంకుమార్చన
- కన్నులపండువగా మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక మాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం–2026 వేడుకలు భక్తి పారవశ్యంతో సాగాయి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, కల్యాణోత్సవాలతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్న ఈ ఉత్సవాల్లో, నవంబర్ 22 ఆదివారం తొమ్మిదో రోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్తీక ఆదివారం, ప్రదోష పర్వదినం సందర్భంగా నిర్వహించిన పలు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె. లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పీఠాధిపతి సందేశం.. ప్రవచనామృతం
తొమ్మిదో రోజు వేడుకల్లో భాగంగా మూలామ్నాయ కంచి సర్వజ్ఞ పీఠాధిపతీశ్వరులైన జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామీజీ అనుగ్రహ భాషణం భక్తులకు మార్గదర్శనం చేసింది. స్వామీజీ ఆశీస్సులు, ఆధ్యాత్మిక సందేశాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ నందూరి శ్రీనివాస్ ప్రవచనామృతం వినిపిస్తూ, ధర్మం, భక్తి, ఆధ్యాత్మిక విషయాలపై భక్తులకు సందేశాన్ని అందించారు.
Also Read
- Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. 'భోగి' వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
- Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
- Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
- Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
విశేష పూజలు.. భక్తుల కుంకుమ అర్చన
వేదికపై కంచి కామాక్షి మహాభిషేకం, చందనాలంకార దర్శనం, కోటి సుపుష్పకుంకుమల సమర్పణోత్సవం, ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి వంటి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు భక్తుల చేతుల మీదుగా కంచి కామాక్షి విగ్రహాలకు పసుపు కుంకుమల అర్చన నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.
మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణం.. పల్లకి సేవ
వేడుకల్లో ప్రధాన ఘట్టంగా మధురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. కార్యక్రమాల ముగింపులో పల్లకి వాహన సేవ నిర్వహించగా, సప్త హారతులు, స్వర్ణ లింగోద్భవం భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. కార్తీక మాసంలో నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవంలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు పాల్గొంటుండగా, తొమ్మిదో రోజు వేడుకలు ఆధ్యాత్మిక శోభతో ఘనంగా ముగిశాయి.
కోటి దీపోత్సవంలో అంగరంగ వైభవంగా మధురై మీనాక్షి సుందరేశ్వరుల మాంగల్యధారణ | Bhakthi TV
#KotiDeepotsavam2026 #BhakthiTV https://t.co/aipuQc4OwL
— BhakthiTV (@BhakthiTVorg) November 22, 2026
కోటి దీపోత్సవంలో గాయత్రీ దేవి అలంకరణలో కొలువుదీరిన దుర్గమ్మకు దివ్య హారతి! | Koti Deepostavam 2026 DAY 9 | Bhakthi TV
#GayatriDevi #GoddessDurga #DivineAarti #KotiDeepotsavam2026 #BhakthiTV https://t.co/gdtPixWRA3
— BhakthiTV (@BhakthiTVorg) November 22, 2026
Divine Rangoli Artwork of Goddess Kanchi Kamakshi | Koti Deepotsavam 2026 DAY 9 | Bhakthi TV
#KanchiKamakshi #RangoliArt #KotiDeepotsavam2026 #DivineArtwork #BhakthiTV https://t.co/oAtAeWEPmQ
— BhakthiTV (@BhakthiTVorg) November 22, 2026
Mesmerising Rangoli Art of Meenakshi Amman at Koti Deepotsavam 2026 DAY 9 | Bhakthi TV
#MaduraiMeenakshi #MeenakshiAmman #RangoliArt #KotiDeepotsavam2026 #BhakthiTV https://t.co/PUWfi6jWFq
— BhakthiTV (@BhakthiTVorg) November 22, 2026
కోటిదీపోత్సవం-2026 9వ రోజు ఉత్సవంలో భాగంగా కంచి కామాక్షి అమ్మవారికి మహాభిషేకం.
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2024 #కోటిదీపోత్సవం https://t.co/nol4ahVnlo
— BhakthiTV (@BhakthiTVorg) November 22, 2026
రాజ్యసభ సభ్యులు, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె. లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు @ భక్తి టీవీ కోటిదీపోత్సవం-2026
#KLaxman #BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం
@drlaxmanbjp @N_RamchanderRao @BJP4Telangana @BJP4India— BhakthiTV (@BhakthiTVorg) November 22, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!