Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
- వైభవంగా ఏకామ్రేశ్వరస్వామి కల్యాణం
- భక్తులను ఆకట్టుకున్న నవధాన్య లింగార్చన
- స్వామీజీల అనుగ్రహ భాషణాలు, గరికిపాటి ప్రవచనం
- సతీసమేతంగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం–2026 వేడుకలు పదో రోజున అత్యంత వైభవంగా జరిగాయి. పవిత్రమైన కార్తీక రెండో సోమవారం, వైకుంఠ చతుర్దశి పర్వదినం సందర్భంగా సోమవారం, నవంబర్ 23న నిర్వహించిన ప్రత్యేక పూజలు, ప్రవచనాలు, కల్యాణోత్సవం వేడుకలతో ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.
కంచి శ్రీ ఏకామ్రేశ్వరస్వామి కల్యాణోత్సవం, పల్లకి సేవ వైభవం
పదో రోజు వేడుకల్లో కంచి శ్రీ ఏకామ్రేశ్వరస్వామి కల్యాణోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కల్యాణ ఘట్టాన్ని నిర్వాహకులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించగా, భక్తులు భక్తిభావంతో ఆ దృశ్యాన్ని తిలకించారు. అంతకుముందు సప్తహారతులు, స్వర్ణలింగోద్భవం కూడా ఎంతో అద్భుతంగా, కన్నుల పండుగగా జరిగాయి.
Also Read
- Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
- Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
- Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy : భూసేకరణ లెక్కలతో కేసీఆర్‌పై రేవంత్ ఫైర్.. పాలమూరు–రంగారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
నవధాన్య లింగార్చన, భస్మ హారతి, భక్తుల పూజలు
వేదికపై నిర్వహించిన నవధాన్య లింగార్చన, ఉజ్జయిని మహాకాళి భస్మ హారతి వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భక్తులు స్వయంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. భక్తులచే శివలింగాలకు నవధాన్యాలతో అర్చన నిర్వహించడంతో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.
స్వామీజీల అనుగ్రహ భాషణం.. గరికిపాటి ప్రవచనామృతం
ఆధ్యాత్మిక చింతనను పెంచేలా పదో రోజు వేడుకల్లో అనుగ్రహ భాషణాలు, ప్రవచనాలు జరిగాయి. శ్రీకాళహస్తి శ్రీ శుకబ్రహ్మాశ్రమం పీఠాధిపతి శ్రీ సంపూర్ణానందగిరి స్వామీజీ, శ్రీ పైవేక్షేత్రం శ్రీశ్రీశ్రీ శివ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేసి ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. అనంతరం పద్మశ్రీ పురస్కార గ్రహీత, మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు తమ ప్రవచనామృతంతో భక్తులను ఆకట్టుకున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు..
పదో రోజు కోటి దీపోత్సవ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోటి దీపోత్సవం గొప్ప ఆధ్యాత్మిక పండుగ అని కొనియాడారు. దీపం కేవలం కాంతినివ్వడమే కాకుండా అజ్ఞానాన్ని కూడా తొలగిస్తుందని చెప్పారు. కార్తీక మాసం అనగానే అందరికీ కోటి దీపోత్సవం గుర్తుకొస్తుందని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, పూజలు, దీపారాధన చేసుకునేందుకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచితంగా పూజా సామాగ్రిని అందజేసి, వేడుకల్లో ప్రతి భక్తుడు పాలుపంచుకునే అవకాశాన్ని కల్పించింది.
ఇక్కడ కోటి కాంతి పుంజాలు కనిపిస్తున్నాయి : Sri Garikipati Narasimha Rao | Koti Deepotsavam 2026
#GarikapatiNarasimhaRao #Deepam #KotiDeepotsavam2026 #BhakthiTV https://t.co/ATa8KIIShp
— BhakthiTV (@BhakthiTVorg) November 23, 2026
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు @ భక్తి టీవీ కోటిదీపోత్సవం-2026
#BhattiVikramarkaMallu #BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం
@Bhatti_Mallu @INCTelangana https://t.co/CfEFwLecNk— BhakthiTV (@BhakthiTVorg) November 23, 2026
రాక్షసులు అక్కడే ఉంటారు.. పాములు ఎక్కువగా నిద్రపోతాయి : Sri Garikipati Narasimha Rao | Bhakthi TV
#GarikapatiNarasimhaRao #Deepam #KotiDeepotsavam2026 #BhakthiTV https://t.co/Iu1mWlIqEr
— BhakthiTV (@BhakthiTVorg) November 23, 2026
శివపార్వతులు, నందీశ్వరుడి దివ్యరూపాలు.. కనువిందు చేస్తున్న అద్భుత రంగోలి ఆర్ట్..! Koti Deepotsavam 2026, Day 10
#KotiDeepotsavam2026 #BhakthiTV https://t.co/8hrcJcu8Jv
— BhakthiTV (@BhakthiTVorg) November 23, 2026
అప్పట్లో మహా పాపం చేస్తే పెద్ద కొడుకుగా పుడతాడు అంటారు : Sri Garikipati Narasimha Rao | Bhakthi TV
#GarikapatiNarasimhaRao #Deepam #KotiDeepotsavam2026 #BhakthiTV https://t.co/asPwzKHxfH
— BhakthiTV (@BhakthiTVorg) November 23, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!