Koti Deepotsavam 2025 Day 10: అంగరంగ వైభవంగా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2025 Day 10: కార్తీకమాసం సందర్భంగా ఎంతో వైభవంగా జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 పదవ రోజు కార్యక్రమాలు నవంబర్ 10, సోమవారం (కార్తీక సోమవారం) నాడు అద్భుతంగా నిర్వహించబడ్డాయి. నేడు భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికతతో నిండిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ముంచెత్తాయి. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దెత్తున పాల్గొన్నారు. పదవ రోజు కార్యక్రమంలో పూజ్యశ్రీ జయసిద్ధేశ్వర మహాస్వామీజీ (శ్రీశైలం ఆశ్రమం, బెంగళూరు) వారు భక్తులకు ఆధ్యాత్మిక అనుగ్రహ భాషణం అందించనున్నారు. వారి సందేశం భక్తుల మనసులను ప్రసన్నం చేయనుంది. అలాగే బ్రహ్మశ్రీ పఠాన్‌శెట్టి శ్రీనివాస బంగారు శర్మ భక్తులకు జ్ఞానసారాన్ని పంచే ప్రవచనామృతాన్ని అందించారు.
Amit Shah: పట్టణ ప్రాంతాల్లో సహకార బ్యాంకులు.. ‘కో-ఆప్ కుంభ్’ను ప్రారంభించిన అమిత్ షా
Also Read
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
ఇక నేటి కార్యక్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ మహాపూజ ఘనంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఉజ్జయిని మహాకాళీదేవికి భస్మహారతి సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పూజలతో వేదిక ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోయింది. భక్తులు స్వయంగా పాల్గొని శివలింగాలకు కోటి రుద్రాక్షలతో అర్చన చేశారు. ఇక భక్తి శ్రద్ధల నడుమ కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక చివరిలో నంది వాహన సేవ నిర్వహించారు. ఈ దివ్య దర్శనం భక్తులకు పవిత్రతను ప్రసాదించి, ఆధ్యాత్మిక పరిపూర్ణతను అందించించింది.
Delhi Car Blast Live Updates : ఢిల్లీలో ఉగ్రదాడి.? పేలుడు ఘటనలో 13 మంది మృతి..
ఇక నేడు కోటి దీపోత్సవం పదవ రోజు పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. వీరితోపాటు తెలంగాణ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!