Koti Deepotsavam 2025 Day 10: కార్తీకమాసం సందర్భంగా ఎంతో వైభవంగా జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 పదవ రోజు కార్యక్రమాలు నవంబర్ 10, సోమవారం (కార్తీక సోమవారం) నాడు అద్భుతంగా నిర్వహించబడ్డాయి. నేడు భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికతతో నిండిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ముంచెత్తాయి. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దెత్తున పాల్గొన్నారు. పదవ రోజు కార్యక్రమంలో పూజ్యశ్రీ జయసిద్ధేశ్వర మహాస్వామీజీ (శ్రీశైలం ఆశ్రమం, బెంగళూరు) వారు భక్తులకు ఆధ్యాత్మిక అనుగ్రహ భాషణం అందించనున్నారు.…
Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగిస్తున్నారు. కోటి దీపోత్సవం వేడుక కైలాసాన్ని తలపిస్తోంది. 2012లో లక్ష దీపోత్సవంగా మొదలై, 2013లో కోటి దీపోత్సవంగా మారి భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతున్న ఈ…
భక్తి టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరు. నిత్యం భక్తి కార్యక్రమాలతో వీక్షకులను భక్తి పారవశ్యంలో మునిగి తేలేలా చేస్తుంది. ప్రతి ఇంట్లో ఆధ్యాత్మికత శోభ ఉట్టిపడేలా చేస్తుంది భక్తి టీవీ. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ ‘భక్తి టీవీ’ అరుదైన ఘనత సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దేశంలోనే ‘నంబర్-1’ ఆధ్యాత్మిక ఛానెల్‌గా భక్తి టీవీ నిలిచింది. బార్క్ (BARC) రిలీజ్ చేసిన రేటింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ హిందీ ఛానెల్స్‌ను సైతం…
Koti Deepotsavam 2025: రచన టెలివిజన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 1 నుంచి 13 వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా కొనసాగనుంది. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే దీపాల పండగలో లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దీపాలు వెలిగిస్తారు.