Site icon NTV Telugu

CPI : పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి నిబద్దతతో పనిచేస్తాం

Cpi

Cpi

కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తామని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి నిబద్దతతో పనిచేస్తామని కొత్తగూడెం మున్సిపల్ సీపీఐ పక్ష కౌన్సిలర్లు స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు ఎస్ కె సాబీర్ పాషా, పోటు ప్రసాదులతో సమావేశమైన అనంతరం వారు మాట్లాడారు. బూర్జువా పార్టీలతో పొత్తుల విషయంలో జరుగుతున్న తాత్సారం, జాప్యం, కంమ్యూనిస్టులపట్ల ప్రజల్లో కలుగుతున్న ఆలోచనల నేపధ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురై మీడియా పక్షాన తొందరపాటుతో ప్రకటన విడుద చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. అభ్యర్థి విషయంలో తమ అభిప్రాయాన్ని రాష్ట్ర పార్టీ ప్రతినిధికి వివరించామని, మా అభిప్రాయంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తామని, పార్టీలో ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని ఈ విషయంలో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కండిస్తున్నామని తెలిపారు.

Also Read : Jasprit Bumrah: ప్రపంచకప్‌లో మరో రికార్డ్.. తొలి బంతికే ఘనత సాధించిన స్టార్ బౌలర్

కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నాయకత్వంలో అయన సూచనమేరకు నిబద్ధతతో పని చేస్తామని, వచ్చే ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ కౌన్సిలర్ల అభిప్రాయంపై వారితో చేర్చించామని, సమస్య సమసిపోయిందని తెలిపారు. పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషిచేసేందుకు కౌన్సిలర్లు ముందుకు వచ్చారని తెలిపారు. సమావేశంలో సిపిఐ పక్ష కౌన్సిలర్లు, నాయకులు వై శ్రీనివాసరెడ్డి, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, పి సత్యనారాయణ చారి, నాయకులు ముత్యాల విశ్వనాధం, మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, వట్టికొండ మల్లికార్జునరావు, ఉదయ్ భాస్కర్, జి వీరాస్వామి, వంగ వెంకట్, గెడ్డాడు నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : Mohammed Shami: మహ్మద్ షమీ ఖాతాలో మరో రికార్డ్

Exit mobile version