Kota Srinivasa Rao: ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు కోటా అని కేసీఆర్ పేర్కొన్నారు. సినిమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేస్తూ.. కోట గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Read Also:Kota Srinivasa Rao Death : కోట మరణం.. లైవ్ లో ఏడ్చేసిన బ్రహ్మానందం
అలాగే, కోట శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు కూడా సంతాపం ప్రకటించారు. ఆయన సేవలు చిరస్థాయిగా గుర్తుంచుకునేలా ఉంటాయని హరీశ్ రావు అన్నారు. ఇక సినిమాటోగ్రఫీ శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కోట శ్రీనివాసరావు మృతి వార్త తల్లడిల్లేలా చేసిందని పేర్కొన్నారు. విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రశంసలను పొందారు. నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో 750కి పైగా చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి ప్రత్యేక గుర్తింపు పొందారు. పద్మశ్రీ పురస్కారంతో పాటు తొమ్మిది నంది అవార్డులు ఆయన నటనా ప్రతిభకు లభించిన గౌరవాలు అని తలసాని అన్నారు. కోటా మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీరని లోటుకు లోనైంది. సినీ అభిమానులు, రాజకీయ నేతలు, సహనటులు అందరూ ఆయన ప్రస్థానాన్ని, నటనను, వ్యక్తిత్వాన్ని చాటుతూ నివాళులు అర్పిస్తున్నారు.
Read Also:KOTA : కోట శ్రీనివాసరావుకు చిరు, బాలయ్య ఘన నివాళి..