Site icon NTV Telugu

Koppu Basha : దళితులను ఈ ప్రభుత్వం అవమానిస్తుంది

Bjp Logo

Bjp Logo

ఎలక్షన్ వచ్చినప్పుడల్ల బీజేపీ రిజర్వేషన్ లు ఎత్తేస్తుందని కాంగ్రెస్ కు ప్రచారం చేయడం అలవాటు అని బీజేపీ నేత కొప్పు భాష మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ భారతరత్న ఇవ్వకుండా , నెహ్రూ, రాజీవ్ గాంధీకి లకు ఇచ్చారు.. ఆయన్ను అవమానించారన్నారు. దళితులను ఈ ప్రభుత్వం అవమానిస్తుందని, అంబేద్కర్ విగ్రహం దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు రేవంత్ రెడ్డి అని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ లకు ఉన్న 84 సీట్ల 46 సీట్లు బీజేపీ గెలిచిందని, కేటీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని కెసిఆర్ అన్నప్పుడు ఎక్కడ పోయావని ఆయన అన్నారు. అంబేద్కర్ ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ అని, రిజర్వేషన్ లను మారుస్తారు అంటే బట్టలు విప్పి కొడతామన్నారు కొప్పు భాష.

 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వారిని నడి రోడ్డున పడేసిందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించి మహిళల పుస్తెల తాడు తెంచిన నీచుడు కేసీఆర్‌ అని అన్నారు. కేసీఆర్‌ తెలంగాణకు పట్టిన శని అని, అందుకే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. పరాయోడు మోసం చేస్తే పొలిమేరదాకా తరిమికొట్టమని, సొంతోడు మోసం చేస్తే పాతపెట్టమని ప్రజాకవి కాళోజీ అన్నారని, తెలంగాణను దోచుకున్న ఆంధ్రా పాలకులను తరిమికొట్టి పొలిమేర దాటించినమని, ఇగ బీఆర్‌ఎస్‌ను పాతరేసే టైమొచ్చిందన్నారు. జూన్‌ 4న ఆ పార్టీని గొయ్యి తీసి వెయ్యి అడుగుల లోతున పాతరేసేందుకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారన్నారు. స

 

Exit mobile version